అశ్వద్ధామ( Aswaddha ) గా అమితాబ్ బచ్చన్ కనిపిస్తున్న గ్లింప్స్ వదలగానే బాలీవుడ్ మీడియా అలాగే కొంతమంది బాలీవుడ్ ప్రేక్షకులు ప్రభాస్ పై విషం కక్కడం మొదలుపెట్టారు.ప్రభాస్ కెరియర్ లోనే ఆది పురుష్ అనే ఒక సినిమా మాయని మచ్చగా మిగిలిపోయింది.
ఈ సినిమాను తీసిన ఓం రౌత్( om routh ) ఎప్పటి నుంచో ఉన్నావు ఒక పురాణ కథను తీసుకొని అందరిని మెప్పించలేకపోయాడు.ఇప్పుడు ప్రభాస్ ని ఒక పురాణ కథలో చూపించి సక్సెస్ కొట్టడం అనే బాధ్యత నాగ్ అశ్విన్ భుజాలపైనే ఉంది.
చాలామంది కల్కి( Kalki ) గ్లిమ్స్ చూసిన తర్వాత అద్భుతమైన టెక్నాలజీని కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు అని ఒక వర్గం వారు అంటూ ఉంటే ఈ మాత్రం దానికి ఇంత ఊదరగొట్టాలా అంటూ మరొక వర్గం అంటున్నారు.

కానీ ఎక్కువ శాతం ప్రభాస్ కె సోషల్ మీడియా సపోర్ట్ చేస్తుంది.అయితే ఓం రౌత్ అలాంటి ఒక దర్శకుడికి నాగ్ అశ్విన్( Nag ashwin ) లాంటి ఒక దర్శకుడు తో కంపారిజన్ మాత్రం కరెక్ట్ కాదు.ప్రభాస్ కెరియర్ ని చెడగొట్టడానికి ఓం రౌత్ కంకణం కట్టుకున్నట్టుగా ఆది పురుష్ సినిమా చూస్తే అర్థమవుతుంది.
కానీ మన తెలుగు దర్శకుడైన నాగ్ అశ్విన్ అలాంటి వ్యక్తి కాదు సినిమా అంటే ప్రాణం కాదు కాదు పిచ్చి.మహానటి సినిమా చూస్తే ఒక ఆర్డినరీ వ్యక్తులు ఎవరు ఆ సినిమా తీయలేరు అని అర్థం చేసుకోవచ్చు.
అందుకే ప్రభాస్ నాగ్ అశ్విన్ నీ నమ్మి ఇంత పెద్ద స్క్రిప్ట్ కి ఒకే చెప్పాడు.పైగా పురాణ కాలం నుంచి మోడరన్ యుగం వరకు సాగే ఒక కథని ఏమాత్రం అటు ఇటుగా చూపించిన అది పులిహోర అయిపోతుంది అందుకే ఎంతో కష్టపడి నాగ్ అశ్విన్ ఆ సినిమాని చెక్కుతున్నాడు.

అందుకే ఈ సినిమా విడుదల కూడా చాలా ఆలస్యం అవుతుంది ఫ్రేమ్ టు ఫ్రేమ్ సినిమాని అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని విడుదల చేయాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అనుకుంటున్నారు.ఈ సినిమా విడుదలయ్యాక ప్రభాస్ ఎలాంటి పాత్రనైనా సరిగ్గా చేయగలడు అని అందరూ ఒప్పుకుంటారు అనే నమ్మకంతో ఉన్నాడు.మరికొద్ది రోజులు ఆగితే ఈ సినిమా ఫలితం కూడా మనకు అర్థమవుతుంది అలాగే మన సినిమా స్థాయి కూడా ప్రపంచానికి తెలిసి వస్తుంది.కల్కి సాధారణ దర్శకులకు ప్రేక్షకులకు అందని ఒక సినిమాగా కచ్చితంగా ఉంటుంది అని అందరూ భావిస్తున్నారు.