ఎప్పుడు హీరోలుగా చేస్తే కొత్త కిక్కేం వస్తుంది చెప్పండి అప్పుడప్పుడు విలన్ గా ట్రై చేస్తే కూడా అదో కిక్కు.పైగా భాష మారిస్తే అది మరింత కిక్కిస్తుంది.
అందుకే మన టాలీవుడ్( Tollywood ) లో కొంతమంది కథానాయకులు ప్రతినాయకులుగా మారి సినిమాలను తెరకెక్కించే పనిలో ఉన్నారు.అందులో కొందరు మనవారైతే కొంతమంది పక్క భాషల వారు.
ఏదైతేనేం హీరోగా చేసి చేసి బోర్ కొట్టిందో ఏమో విలన్సుగా బిజీ అవ్వాలని లేదా ఒకసారి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని డిసైడ్ అయిపోయారు.అలా విలన్ గా సినిమాల్లో నటిస్తున్న ఆ హీరోను ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తారక్( Tarak ) చాలా రోజులుగా విలన్ గా నటించాలని ఆరాటపడుతున్నాడు అందుకే జై లవకుశ సినిమాలో ఒక పాత్రలో విలన్ షెడ్స్ కనిపించాయి.ఆ సినిమాలో అతని నటనకు ఫిదా అయినా బాలీవుడ్ ఇప్పుడు అతనికి వారు హ్రితిక్ రోషన్ కి విలన్ గా నటించే అవకాశం ఇచ్చింది.కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాదు కే జి ఎఫ్ ( KG F )సినిమాలో యష్( Yash ) సైతం విలన్ గా బాగా ట్రై చేసి విజయం సాధించారు ఇప్పుడు కే జి ఎఫ్ 3 కూడా తెరకెక్కుతుంది.సలార్ సినిమాలో సైతం ప్రభాస్ స్నేహితుడుగా నటిస్తున్న పృథ్వీరాజ్( Prithviraj ) తెలుగు సినిమా వారికి పరిచయస్తుడే.
అయితే ఇతడు మలయాళంలో సూపర్ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులో సలార్ సినిమాకి విలన్ గా నటిస్తున్నాడు.ఇప్పుడు దీనికి సంబంధించిన పార్ట్ టూ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
పార్టీ లేదా పుష్ప అనే ఒకే ఒక డైలాగ్ తో సూపర్ విలన్ గా క్రేజీ ఫాలోయింగ్ పెంచుకున్నాడు తెలుగులో ఫహద్ ఫాజిల్( Fahad Fazil ).మలయాళం లో మంచి స్టార్ హీరో అయినప్పటికీ పుష్ప కోసం విలన్ గా అవతారం ఎత్తాడు.ఇప్పుడు కల్కి సినిమా గురించి సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్ లు వస్తున్నాయి.ఈ సినిమాలో ప్రభాస్ కి విలన్ గా కమల్ హాసన్ ( Kamal Haasan )నటిస్తున్నాడు.
సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాదు అందరికి ఇది పెద్ద సర్ప్రైజ్ న్యూస్.ఇక అనిమల్ సినిమాలో హీరో ఎవరో విలన్ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు.దీనికి సంబంధించిన పార్ట్ టూ కూడా రాబోతుంది ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరో కం విలన్ పాత్రలో నటిస్తున్నాడు.