మెంతులు( Fenugreek )దాదాపు ప్రతి ఒక్కరి పోపుల పెట్టె లో ఉండే దినుసుల్లో ఒకటి.రుచికి చేదుగా ఉన్నా మెంతుల్లో అనేక రకాల పోషకాలు, ఔషధ గుణాలు నిండి ఉంటాయి.
అందువల్ల ఆరోగ్యపరంగా మెంతులు చేసే మేలు అంతా కాదు.అయితే చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా మెంతులు ఎంతో అద్భుతంగా తోడ్పడతాయి.
ముఖ్యంగా రెండు స్పూన్ల మెంతులను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే మచ్చలు లేని మెరిసే తెల్లటి చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతుల పొడిని వేసి ఐదారు నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు( Turmeric ) వేసి బాగా దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

కాస్త చల్లారిన తర్వాత ఉడికించిన మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో స్మూత్ క్రీమ్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ క్రీమ్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E Oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా ఒక మంచి క్రీమ్ సిద్ధమవుతుంది.
ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడొచ్చు.నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి మెడకు అప్లై చేసుకుని సున్నితంగా రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకుని పడుకోవాలి.
మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతిరోజు కనుక చేస్తే చర్మంపై ఎలాంటి మొండి మచ్చలు ఉన్నా మాయమవుతాయి.పిగ్మెంటేషన్ సమస్య దూరం అవుతుంది.స్కిన్ టోన్ ఈవెన్ గా మారుతుంది.
ముఖం వైట్ గా బ్రైట్ గా మెరుస్తుంది.మొటిమలు రావడం సైతం తగ్గుముఖం పడతాయి.
కాబట్టి మచ్చలు లేని మెరిసే అందమైన ముఖ చర్మం కోసం తప్పకుండా ఈ క్రీమ్ ను వాడేందుకు ట్రై చేయండి.