చుండ్రును తరిమికొట్టే గ్రీన్ టీ.. ఎలా వాడాలో తెలుసా?

గ్రీన్ టీ.దీని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.

 Green Tea Helps To Remove Dandruff Quickly! Green Tea, Dandruff, Dandruff Remova-TeluguStop.com

బరువు తగ్గాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరూ తమ డైట్ లో గ్రీన్ టీ ఉండేలా చూసుకుంటారు.వెయిట్ లాస్‌కు మాత్రమే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను గ్రీన్ టీ అందిస్తుంది.

అలాగే జుట్టు సంరక్షణకు సైతం గ్రీన్ టీ ఉపయోగపడుతుంది.ముఖ్యంగా చుండ్రును తరిమి కొట్టడానికి గ్రీన్ టీ ఉత్తమంగా సహాయపడుతుంది.

మరి ఇంతకీ గ్రీన్ టీ ని ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ వేసి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్ట‌వ్ హాఫ్‌ చేసి స్టైనర్ సహాయంతో గ్రీన్ టీ ని ఫిల్టర్ చేసుకుని చల్లార‌బెట్టుకోవాలి.

ఈలోపు ఒక కలబంద ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో అలోవెరా జెల్ మరియు గ్రీన్ టీ వేసుకుని రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి.ఈ జ్యూస్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.స్కాల్ప్ కు తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకుని గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్‌ షాంపూతో తల స్నానం చేయాలి.

వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే గ్రీన్ టీ మరియు కలబంద లో ఉండే ప్రత్యేక గుణాలు చుండ్రును కేవలం కొద్ది రోజుల్లోనే మాయం చేస్తాయి.స్కాల్ప్ ను శుభ్రంగా మరియు ఆరోగ్యంగా మారుస్తాయి.అంతేకాదు ఈ విధంగా గ్రీన్ టీ ని జుట్టుకు ఉపయోగించడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది.తలలో ఇన్ఫెక్షన్స్ సైతం తగ్గుముఖం పడతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube