ఒకప్పుడు చిరంజీవి వసరుసగా సినిమాలు చేస్తూ మెగాస్టార్ చిరంజీవి గా మంచి పేరు సంపాదించుకున్నారు అయితే చిరంజీవి కి ఇండస్ట్రీ కి వచ్చినప్పుడు ఆయనకంటూ ఇండస్ట్రీ లో సపోర్ట్ ఎవరూలేరు కానీ ఆ తరువాత సురేఖ గారిని పెళ్లి చేసుకున్నాక సురేఖ వల్ల అన్నయ్య అయినా అల్లు అరవింద్ చిరంజీవి కి సంభందించిన సినిమా వ్యవహారాలు మొత్తం చూసుకునేవారు అలా చిరంజీవి ఏ సినిమాలు చేయాలి ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు ఆయన నుంచి ఏ సినిమాలు కోరుకుంటున్నారు అనే విషయాలు అన్ని తెలుసుకొని డైరెక్టర్స్ తో మాట్లాడి సినిమాలు సెట్ చేసేవాడు అలా చాలా రోజుల పాటు అరవింద్ ఆయన సినిమాల విషయాలు చూసుకున్నారు.

అయితే అల్లు అరవింద్ కూడా చిరంజీవి ఇమేజీని క్యాష్ చేసుకుంటూ ఆయన సినిమాలకి ప్రొడ్యూసర్ గా ఉంటూ ఆయన కూడా బాగానే సంపాదించుకున్నాడు.టాప్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే ఇప్పుడు అల్లు అరవింద్ గారి కొడుకు అయిన అల్లు అర్జున్ ఇప్పుడు స్టార్ హీరో అయ్యారు అలాగే అల్లు అరవింద్ కూడా ఆహా అనే ఓటిటి ప్లాట్ఫామ్ పెట్టి ఇటు సినిమాలకి ప్రొడ్యూసర్ చేస్తూనే అటు ఆహా కు సంభందించిన పనులు చూసుకుంటున్నారు.

అల్లు అరవింద్ మెగా ఫ్యామిలీ లో ఉన్న టాప్ హీరోలు అయిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లతో సినిమాలు ప్రొడ్యూస్ చేయక చాలా సంవత్సరాలు అవుతుంది.ఎందుకు ఆయన వాళ్ళతో సినిమాలు చేయడం లేదు అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీ లో ఉండటం, హీరోలు కూడా కొత్త ప్రొడ్యూసర్స్ తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం తో బయట ప్రొడ్యూసర్స్ వచ్చి మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమాలు చేస్తున్నారు.








