Rajamouli : రాజమౌళి సినిమా తీయడంలోనే కాదు .. లాబీయింగ్ చేయడం లోన దిట్టే

ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాకి అవార్డులు తీసుకురావడంలో ఆ మూవీ దర్శకుడు రాజమౌళి లాబియింగ్‌కి పాల్పడ్డాడా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.నేషనల్ అవార్డు సెరమొనీలో ఈ సినిమాకి వచ్చిన పురస్కారాల చూసి చాలా మంది ఈ కామెంట్స్ చేస్తున్నారు.

 Rajamouli Again Twisted National Awards-TeluguStop.com

రాజమౌళి నేషనల్ అవార్డుల జ్యూరీకి ప్రమోషనల్ మెటీరియల్స్ పంపించి, ఆర్థికంగా ఎంతో కొంత ముట్ట చెప్పి వారి చేత ఆర్ఆర్ఆర్ సినిమాకి అవార్డులు ఇప్పించారని సోషల్ మీడియాలో ఒక ప్రచారం సాగుతోంది.

తాజాగా ప్రకటించిన నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2021 ( National Film Awards 2021 )సంవత్సరానికి సంబంధించినవి.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా 2022 మార్చి 25న రిలీజ్ అయింది.కానీ దీనికి బెస్ట్ పాపులర్ ఫిలిం అవార్డు అందించారు.2021లో ఇది అసలు రిలీజ్ అయిన కాలేదు.అలాంటప్పుడు ఆ సమయంలో ఈ మూవీ పాపులర్ ఎలా అవుతుంది? దానికి ఎలా అవార్డు ఇస్తారు? అనే సందేహాలను చాలామంది వ్యక్తం చేస్తున్నారు.అయితే అవార్డు కమిటీకి విడుదల తేదీతో సంబంధం లేదని, గతంలో కూడా 2017 లో రిలీజ్ అయిన శతమానం భవతి సినిమాకి 2016 కింద అవార్డు అందించారని మరికొందరు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Telugu Keeravani, National Awards, Pushpa, Rajamouli-Telugu Stop Exclusive Top S

నిజానికి ఆస్కార్ అవార్డు వచ్చినా సరే ట్రిపుల్ ఆర్ 2021లో రిలీజ్ కాలేదు.2021 అవార్డుల కింద దానిని పరిగణించడం నేషనల్ అవార్డు జ్యూరీ చేసిన పెద్ద తప్పేనని చెప్పవచ్చు.నెక్స్ట్ ఇయర్ లేదా ఆ పై వచ్చే సంవత్సరంలో త్రిబుల్ ఆర్ మూవీకి బెస్ట్ పాపులర్ ఫిలింగా, రాజమౌళి కి బెస్ట్ పాపులర్ డైరెక్టర్‌గా అవార్డులు ఇస్తే సరిపోయేది కదా! అని మరికొందరు ఎగతాళిగా వ్యాఖ్యానిస్తున్నారు.

లాబియింగ్‌కి రాజమౌళి పాల్పడితే జ్యూరీ మెంబర్స్ ఎలాంటి అవార్డులనైనా ఇచ్చేస్తారు కదా ఇంత తొందర ఎందుకు అన్నట్లు వారు వ్యంగ్యంగా చర్చ చేస్తున్నారు.

Telugu Keeravani, National Awards, Pushpa, Rajamouli-Telugu Stop Exclusive Top S

సాహిత్యం అసలు బాగోలేని నాటు నాటు పాటకు అవార్డు ( Natu Natu Song Award )ఇవ్వడం బ్లండర్ అని అంటున్నారు, కీరవాణికి అవార్డు ఇచ్చినా, చంద్రబోస్ సాహిత్యం భాషలు బాగోలేదని అతను అవార్డుకు అనర్హులని కూడా కామెంట్లు పెడుతున్నారు.ఇక లాబీయింగ్ అనేది చాలా పరిశ్రమలలో కామన్ గా జరిగేదే.స్టూడియోలు, నిర్మాణ సంస్థలు తమ చిత్రాలను నామినేట్ చేయడానికి, అవార్డులను గెలుచుకోవడానికి తరచుగా కోట్ల రూపాయలను లాబీయింగ్ చేస్తాయి.

సినిమా పాపులారిటీ పెంచి రెవెన్యూ రెట్టింపు చేసుకోవడానికి, ఆ సినిమాలో నటించిన నటీనటులు, దర్శకుల పాపులారిటీ పెంచుకోవడానికి, సినిమాని గొప్పదానిగా మార్చడానికి లాబీయింగ్ ఎక్కువగా చేస్తుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube