ఓట్స్ తో ఇలా చేస్తే మేకప్ అక్కర్లేదు.. సహజంగానే అందంగా మెరిసిపోతారు!

ఓట్స్.ప్రస్తుత రోజుల్లో వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

 Oats Make You Glow Beautifully! Oats, Oats Benefits, Latest News, Skin Care, Ski-TeluguStop.com

హెల్త్, ఫిట్ నెస్ పై శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ ఓట్స్ ను తమ డైట్ లో చేర్చుకుంటూ ఉంటారు.ఆరోగ్యపరంగా ఓట్స్ అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

అయితే చర్మ సౌందర్యానికి( Skin care ) కూడా ఓట్స్ సహాయపడతాయి.ముఖ్యంగా ఓట్స్( Oats ) ను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే మేకప్‌ అక్కర్లేదు.

సహజంగానే అందంగా మరియు కాంతివంతంగా మెరిసిపోతారు.మరి ఇంకెందుకు ఆలస్యం చర్మానికి ఓట్స్ ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా చిన్న కీర దోసకాయ( Cucumber ) తీసుకుని వాటర్ తో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కలు మరియు ప‌ది ఫ్రెష్ పుదీనా ఆకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడర్ ను వేసుకోవాలి.

Telugu Tips, Skin, Latest, Oats, Oats Benefits, Oats Face Pack, Skin Care, Skin

అలాగే చిటికెడు వైల్డ్ టర్మరిక్ పౌడర్ వేసి కలుపుకోవాలి.చివరిగా సరిపడా కీర పుదీనా జ్యూస్ ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు కాస్త మందంగా అప్లై చేసుకుని ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఓట్స్‌ తో ఈ విధంగా ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంపై పేరుకుపోయిన మురికి మృతకణాలు తొలగిపోతాయి.చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.

Telugu Tips, Skin, Latest, Oats, Oats Benefits, Oats Face Pack, Skin Care, Skin

చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.పిగ్మెంటేషన్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి.చర్మం బిగుతుగా మారుతుంది.వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.స్కిన్ ఎల్లప్పుడూ యవ్వనంగా మరియు ఆకర్షణీయంగా మెరుస్తుంది.

కాబట్టి మేకప్ తో పని లేకుండా సహజంగానే అందంగా మెరిసిపోవాలని కోరుకునేవారు తప్పకుండా ఓట్స్ తో పైన చెప్పిన రెమెడీని పాటించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube