తండ్రి కారణంగా వరలక్ష్మి ఎన్ని గొప్ప సినిమాలు కోల్పోయిందో తెలుసా ?

వరలక్ష్మి శరత్ కుమార్… శరత్ కుమార్ కూతురుగా ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న విలని నటిగా మంచి పేరు సంపాదించుకుంటుంది.తండ్రి శరత్ కుమార్ పేరు ఎక్కడా కూడా వాడుకోకుండానే తనకు తానుగా నటిగా ప్రూవ్ చేసుకుని 2022 లో 9 సినిమాలు చేస్తూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది.

 Why Varalakshmi Lost Great Films In Her Career , Varalakshmi Sarath Kumar, Telug-TeluguStop.com

నటిస్తున్న ప్రతి సినిమాలో తన డబ్బింగ్ తానే చెప్పుకుంటూ తనలోని నటికీ పదును పెడుతూ ముందుకు సాగుతుంది.

తెలుగు, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో 30కి పైగా సినిమాల్లో నటించి సక్సెస్ఫుల్ నటిగా కొనసాగుతోంది.

పోదా పొడి అనే సినిమాతో 2012 లో మొదట ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి హీరోయిన్ గానే ఉండాలని హద్దులు పెట్టుకోలేదు.మంచి పాత్ర వస్తే విలనిజం పండించడానికి ఆమె సిద్ధంగా ఉంది.

అలాగే ప్రస్తుతం అనేక సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ పోషిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారింది.కేవలం సినిమాల్లోనే కాదు టెలివిజన్ హోస్టుగా మారి అనేక రియాల్టీ షోస్ కి జడ్జ్ గా పనిచేస్తుంది.

ఆమె నటనకు అనేక అవార్డులు సైతం ఆమెను భరించాయి అలాగే వరలక్ష్మి అప్పుడప్పుడు కాంట్రవర్సీలు మాట్లాడుతూ పప్పులో కాలేస్తూ ఉంటుంది.

ఇక 27 ఏళ్ల వయసులో తొలిసారి సినిమాలో నటించిన వరలక్ష్మి గత పదేళ్లుగా అనేక ముఖ్యమైన పాత్రలను పోషించింది.

అయితే వాస్తవానికి చాలా లేట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆమె తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది.అసలు నిజం చెప్పాలంటే 2003లోనే వరలక్ష్మి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాల్సింది.

కానీ ఆ తర్వాత దశాబ్దానికి పైగా ఆమె సమయం తీసుకుని తన తొలి సినిమాకి సంతకం చేసింది.అయితే ఇందుకు ముఖ్యమైన కారణం ఆమె తండ్రి శరత్ కుమార్ అని తెలుస్తోంది.

మొదటిసారిగా 2003లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాలో జెనీలియా పాత్రలో వరలక్ష్మీ నటించాల్సి ఉండగా, అందుకు శరత్ కుమార్ నిరాకరించాడు.ఇక ఆ తర్వాత 2004లో వచ్చిన బాలాజీ శక్తివేల్ సినిమా అయినా కాదల్ చిత్రంలోని సంధ్య పాత్రలో వరలక్ష్మి నటించాల్సి ఉంది.

ఆ సినిమాని సైతం శరత్ కుమార్ నిరాకరించాడు.ఇక 2008లో వెంకట్ ప్రభు సినిమా అయినా సరోజా లోనూ ఆమె నటించాల్సి ఉంది.కానీ శరత్ కుమార్ అభ్యంతరం తెలపడంతో ఈ సినిమా కూడా వరలక్ష్మి వదులుకోవాల్సి వచ్చింది.

Telugu Genelia, Kannada, Malayalam, Shankar, Tamil, Telugu-Telugu Stop Exclusive

ఈ మూడు సినిమాలు కూడా అద్భుతమైన హిట్ చిత్రాలుగా నిలిచి సినిమా ఇండస్ట్రీలోనే బ్లాక్ బస్టర్స్ గా పేరు తెచ్చుకున్నాయి.అయితే శరత్ కుమార్ ఈ సినిమాలకు నో చెప్పడంతో ఆమె ఏకంగా పదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.2003లోనే వరలక్ష్మి సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఉంటే ఆమె ఈరోజు మరొక స్థాయిలో ఉండేదని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube