ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరు ఇయర్ బడ్స్ ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు.
ఇక టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్( Earbuds ) అందుబాటులోకి వచ్చాక యువత ఈ బడ్స్ ఉపయోగించడం గణనీయంగా పెరిగింది.అయితే అప్పుడప్పుడు ఇయర్ బడ్స్ ఉపయోగిస్తే పర్వాలేదు.
ప్రతిరోజు గంటలు గంటలుగా ఇయర్ బడ్స్ ఉపయోగిస్తే.వినికిడి శక్తిని కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇటీవలే మార్కెట్లో సౌకర్యంగా, అందంగా, అందుబాటు ధరలో టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్( TWS Earbuds ) విడుదల అవుతూ ఉండడంతో యువత వీటికి ఆకర్షితులై అతిగా ఉపయోగిస్తున్నారు.తాజాగా ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ కు చెందిన ఓ 18 ఏళ్ల యువకుడు ప్రతిరోజు గంటల తరబడి ఇయర్ బడ్స్ ఉపయోగించడం వల్ల వినికిడి శక్తి కోల్పోయాడు.
నిపుణుల సూచనల ప్రకారం.ఇయర్ బడ్స్ గంటల తరబడి ఉపయోగించడం వలన చెవిలో ఇన్ఫెక్షన్( Ear Infection ) వస్తుంది.ఆ తర్వాత కొన్ని రోజులకు వినికిడి శక్తి తగ్గుతుంది.చివరకు చెవిటి వారిగా మారిపోవాల్సిందే.
ఇలా జరగడానికి కారణం ఏమిటంటే గంటల తరబడి చెవిలో ఇయర్ బడ్స్ ఉండడం వల్ల ఇయర్ కెనాల్ లో తేమ పెరుగుతుంది.ఆ తేమలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
తర్వాత చెవి ఇన్ఫెక్షన్ కు గురవుతుంది.చెవి లోపలికి గాలి, వెలుతురు పోకుండా ఇయర్ బడ్స్ లాంటివి ఎక్కువ సేపు అడ్డుపెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
మరి ఇయర్ బడ్స్ ఉపయోగించాలి అంటే గంటల తరబడి కాకుండా అప్పుడప్పుడు విరామం ఇస్తూ ఉండాలి.ఇయర్ బడ్స్ చెవిలో పెట్టుకున్నప్పుడు గరిష్ట వ్యాల్యూమ్ 50 శాతానికి మించి( Earbuds Volume ) పెట్టుకోకూడదు.స్నానం చేసేటప్పుడు చెవులను పరిశుభ్రం చేసుకోవాలి.పూర్తిగా చెవి లోపలికి వెళ్లే ఇయర్ బడ్స్ కాకుండా కాస్త బయటకు ఉండే హెడ్ సెట్ లాంటివి ఉపయోగించడం మంచిది.
ఇక ప్రయాణాలలో ఇయర్ బడ్స్ ఉపయోగించడం చాలా ప్రమాదకరం.