ఖర్జూరాలు ( Dates )ఎంత రుచికరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అందుకే పెద్దలతో పాటు పిల్లలు కూడా ఖర్జూరాలను ఇష్టంగా తింటుంటారు.
ఖర్జూరాల్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, ఫోలేట్, విటమిన్ బి6 వంటి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.అందువల్ల ఆరోగ్య పరంగా ఖర్జూరాలు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.
అయితే మధురమైన రుచిని కలిగి ఉండటం వల్ల ఖర్జూరాలను మధుమేహం ఉన్నవారు తినొచ్చా.? అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది.
అందుకు సమాధానం.మధుమేహం( diabetes ) ఉన్నవారు కూడా ఖర్జూరాలు తినొచ్చు.కానీ మితంగా తీసుకోవాలి.మరియు ఖర్జూరాలు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
చక్కెర వ్యాధి ఉన్నవారు రోజుకు ఒకటి లేదా రెండు చిన్న ఖర్జూరాలు మాత్రమే తినాలి.ఖర్జూరాల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ నుంచి మధ్యస్థం మధ్యలో ఉంటుంది, ఇది మధుమేహులకు చాలా అధికమైనది కాదు.
అయితే తిన్న మొత్తం ఎక్కువైతే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది.

అలాగే మధుమేహం ఉన్నవారు ఖాళీ కడుపుతో పొరపాటున కూడా ఖర్జూరాలను తినకూడదు.భోజనంతో పాటు లేదా ఇతర ఫైబర్ కలిగిన ఆహారాలతో కలిసి ఖర్జూరాలను తినాలి.ఒకవేళ మీ మధుమేహం తీవ్రమైనదైతే, లేదా ఇన్సులిన్ తీసుకుంటుంటే, ఖర్జూరాలు తినే విషయంలో డాక్టరు లేదా డైటిషియన్ సలహా తీసుకోవడం మంచిది.

ఇక ఖర్జూరాల ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే.ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.అలసటగా ఉన్నప్పుడు ఒకటి రెండు ఖర్జూరాలు తింటే ఉత్సాహాన్ని పెంచుతాయి.అలాగే ఖర్జూరాలు రక్తపోటు నియంత్రణలో, చెడు కొలెస్ట్రాల్ ( blood pressure, bad cholesterol )ను తగ్గించడంలో సహాయపడతాయి.
ఖర్జూరాల్లోని ఐరన్, ఫోలేట్, మరియు విటమిన్ బి6 వంటి పోషకాలు అనీమియా నుంచి బయటపడతానికి హెల్ప్ చేస్తాయి.ఖర్జూరాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు పదును పెడతాయి.
ఆలోచన శక్తి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి.అంతేకాకుండా ఖర్జూరాలు ఎముకలను బలోపేతం చేస్తాయి.
కొవ్వు నిల్వలు తగ్గించడంలోనూ తోడ్పడతాయి.







