ఈ మధ్యకాలంలో ఏ ఆహార పదార్థాలైనా ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ముద్రించి అమ్ముతూ ఉంటారు.అలాగే ఏ వస్తువు కొనుగోలు చేస్తున్నా ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది దాని ఎక్స్ పైర్ డేట్.
ఆ వస్తువు కాలపరిమితి ఎంత వరకు ఉన్నదో చెక్ చేసిన తర్వాతే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం చాలా మంచిది.
ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల ఎంపిక విషయంలో ఇది మరి ముఖ్యం.
ఎందుకంటే తేదీ దాటిన వాటిని తినడం ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఆఖరికి తీసుకునే మెడిసిన్ విషయంలో కూడా ఎక్స్ పైర్ డేట్ చూడాలి.అలా చూసుకోకుండా ఉపయోగిస్తే ఒక్కోసారి అవి విషపూరితం అయి ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎక్స్పైరీ డేట్ ముగిసిన ఆహారాన్ని తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది.అయితే గుడ్లు మాంసం కూరగాయలు పండ్లు ఇలాంటివన్నీ త్వరగా పాడైపోయే ఆహారాలు కాబట్టి వీటిని తాజాగా ఉండేటప్పుడు తీసుకోవాలి.
లేదంటే ఆరోగ్యానికి హాని చేసే ప్రమాదం ఉంది.

ప్యాక్ చేసిన ఆహారలపై గడువు తేదీ ముద్రించే వస్తాయి.అటువంటి వాటిని కచ్చితంగా ఆ గడువు తేదీ లోపే తినడం ఎంతో మంచిది.కొన్ని ఆహార పదార్థాలపై గడువు ముగిస్తే కలుషితం చేసే వివిధ రకాల బ్యాక్టీరియాలు చేరిపోతాయి.
ఉదాహరణకి బ్రెడ్.ఇది గడువు తేదీ కంటే ముందే తినకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు.వాటిపై నల్లగా ఫంగస్ వచ్చే అవకాశం ఉంది.ఎక్కువ రోజులు నిల్వ ఉన్న ఆహారంలో పోషక విలువలు తగ్గిపోతాయి.అందుకే గడువు తేదీ దాటిన ఆహారాన్ని తింటే అది ఆరోగ్యానికి మంచిది కాదు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.