బుల్లితెర యాంకర్ అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా వెండితెర ఆఫర్లపై దృష్టి పెడుతూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.అనసూయ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తుండగా ఆ ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
అయితే తాజాగా అనసూయకు చేదు అనుభవం ఎదురు కాగా ఆ అనుభవం గురించి అనసూయ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.కుటుంబంతో కలిసి బెంగళూరుకు వెళ్లిన అనసూయ తిరిగి హైదరాబాద్ రావడానికి అలియన్స్ ఎయిర్ సంస్థకు సంబంధించిన ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకున్నారు.
సాయంత్రం 6.55 గంటలకు టేకాఫ్ కావాల్సిన ఫ్లైట్ దాదాపుగా 30 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని అప్పటివరకు నేను, నా కుటుంబం బస్ లోనే ఉండాల్సి వచ్చిందని ఆమె అన్నారు.ఫ్లైట్ వచ్చిన వెంటనే లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా మాస్క్ లేదని సిబ్బంది ఆపేశారని ఆ తర్వాత మాస్కులు ధరించి ఫ్లైట్ ఎక్కితే కుటుంబంలోని ఒక్కొక్కరిని ఒక్కో చోట కూర్చోబెట్టారని అనసూయ పేర్కొన్నారు.
నేను అందరూ ఒకేచోట కూర్చునే విధంగా టికెట్లు బుకింగ్ చేశానని ఆమె అన్నారు.

నేను టికెట్లు అలా బుకింగ్ చేసినా సిబ్బంది మాత్రం వేర్వేరు చోట్ల కూర్చోబెట్టారని ఆమె అన్నారు.ఆ విమానంలో సీట్లు కూడా సరిగ్గా లేవని ఆమె పేర్కొన్నారు.ఆ సీట్ల వల్ల తన షర్ట్ చిరిగిందని ఆమె చెప్పుకొచ్చారు.అనసూయ చేసిన కామెంట్ల విషయంలో ఆ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

అనసూయ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.అనసూయ రెమ్యునరేషన్ కూడా చాలామంది యాంకర్లతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం అని సమాచారం.అనసూయ తర్వాత ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లు కాగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.







