మునుగోడు ఉపఎన్నికలో గుర్తుల కేటాయింపు పూర్తి అయింది.రిజిస్టర్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ గుర్తులు కేటాయించింది.గుర్తుల మార్పు పై టిఆర్ఎస్ చేస్తున్న ఆందోళనలతో మార్పులు జరిగినట్లు సమాచారం.47 మందికి గుర్తులు కేటాయిస్తూ ఈసీ జాబితా వెల్లడించింది.అంతేకాకుండా రోడ్ రోలర్ గుర్తుని జాబితా నుంచి ఎన్నికల అధికారులు తొలగించారు.అయితే టిఆర్ఎస్ ఎన్నికల గుర్తుపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈ సమయంలో స్పందించలేమంటూ న్యాయస్థానం కొట్టివేసింది.







