ఇలియానా. గోవా నుంచి వచ్చి తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది.టాలీవుడ్ టాప్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది.కానీ చాలా కాలం ఇక్కడ నిలువలేకపోయింది.అనుష్క, నయనతార, కాజల్ సహా పలువురు హీరోయిన్లు వయసుతో సంబంధం లేకుండా ఇంకా సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తుంటే ఇలియానా మాత్రం ఫేడౌట్ అయ్యింది.ఆమె త్వరగా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయని చెప్తారు సీనీ జనాలు.
ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బేసిగ్గా.
ఇలియానాకి పొగరెక్కువ అనే మాట వినిపిస్తుంది.అంతేకాకుండా పలువురు దర్శకులతో గొడవలు ఉన్నట్లు చెప్తారు.
తెలుగులో గతంలో ఓ ప్రముఖ దర్శకుడితో ఆమెకు గొడవ వచ్చిందట.షూటింగ్ టైంలో తనను తీవ్ర ఇబ్బంది పెట్టిందట.
ఆ సినిమా మంచి విజయం సాధించినా.అందులో ఇలియానా క్యారెక్టర్ అంతగా బాలేదట.
దర్శకుడు కావాలనే తనను అలా చేశాడని ఆరోపించిందట.

దీంతో ఆమెపై దర్శకుడు చాలా కోపంగా ఉన్నాడట.ఆయనకున్న పలుకుబడితో మళ్లీ ఆమెకు అవకాశాలు రాకుండా చేశాడనే టాక్ నడిచింది.
పారితోషికం విషయంలోనూ ఇలియానా చాలా మందితో గొడవ పడినట్లు వార్తలు వచ్చాయి.
ఇలియా ఇబ్బందుల్లో ఉందని చెప్పి.ఓ దర్శకుడు ఆఫర్ ఇచ్చాడట.
అయితే ఆ సినిమా కోసం ముందు చెప్పుకున్న రెమ్యునరేషన్ కంటే ఎక్కువ కావాలని డిమాండ్ చేసిందట.

దాంతో ఆ దర్శకుడు ఇలియానాతో మూవీ చెయ్యొద్దనుకున్నాడట.ఇలాంటి ఆరోపణలే మరికొన్ని సినిమాల విషయంలో ఆమె ఎదుర్కొంది.తెలుగుతో పాటు తమిళంలోనూ పలువురితో గొడవలు పడిందట.
అక్కడి ప్రముఖ దర్శకుడితో పేచి పెట్టుకుందట.కోపంతో ఊగిపోయిన ఆయన.తమిళంలో ఆమెకు అవకాశాలు రాకుండా చేశాడట.మొత్తంగా తన కెరీర్ నాశనం కావడానికి తనే కారణం అంటారు సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులు.