సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

దేశ రాజధాని ఢిల్లీలోని సుప్రీం కోర్టు( Supreme Court of Delhi ) పార్కింగ్ స్థలం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.కారణం అక్కడ నిలిపి ఉంచిన లగ్జరీ కార్లు.

సాధారణంగా కోర్టుల దగ్గర కనిపించే కార్లు వేరు.కానీ ఇక్కడ BMW, మెర్సిడెస్ బెంజ్ లాంటి ఖరీదైన కార్లు క్యూ కట్టడంతో జనాలు షాక్ అవుతున్నారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను షేర్ చేసింది ఎవరో కాదు, ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త, ఢిల్లీ బీజేపీ మాజీ మీడియా హెడ్ నవీన్ జిందాల్( Former media head Naveen Jindal ).ఆయన ఈ వీడియోను X (ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ క్యాప్షన్ పెట్టారు.“ఇది కార్ల ఎక్స్ పో కాదు.సెలెక్టెడ్ సుప్రీంకోర్టు లాయర్ల పార్కింగ్ లాట్” అంటూ సెటైర్ వేశారు.టాప్ లాయర్లు సంపాదన చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే అని ఆయన పరోక్షంగా అన్నారు.ఒక్కో కోర్టు విచారణకు ఏకంగా 15 లక్షల రూపాయల వరకు ఫీజు తీసుకుంటున్నారంటూ వార్తలు వస్తుండటంతో ఈ వీడియో మరింత వైరల్ అవుతోంది.

వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.లాయర్లు ఇంత భారీగా ఫీజులు వసూలు చేయడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.కొంతమంది లాయర్లు ఇంతలా సంపాదించడం వెనుక మతలబు ఏంటని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.న్యాయ వ్యవస్థలో అవినీతి పెరిగిపోయిందని, సామాన్యులకు న్యాయం అందడం లేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.”కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి లాంటి లాయర్లు ఒక్కో విచారణకు 50 లక్షలకు పైగా ఛార్జ్ చేస్తారు” అని ఒక యూజర్ కామెంట్ చేయగా, “పేరు లేని లాయర్లు కూడా కేసుకి లక్ష నుంచి మూడు లక్షల వరకు తీసుకుంటున్నారు” అని ఇంకొకరు వాపోయారు.

వినయ్ రాయ్( Vinay Roy ) అనే యూజర్ అయితే లాయర్ల ఫీజులపై లీగల్ లిమిట్ పెట్టాలని డిమాండ్ చేశారు.లాయర్ల అనుభవం, క్వాలిఫికేషన్ బట్టి ఫీజులు ఉండాలని సూచించారు.వైభవ్ ఆర్య అనే మరో యూజర్ స్పందిస్తూ, న్యాయవ్యవస్థ సంస్కరణలు ప్రభుత్వానికి టాప్ ప్రయారిటీ ఉండాలని అన్నారు.జడ్జిలను కూడా పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేయాలని అభిప్రాయపడ్డారు.”రాజ్యాంగం న్యాయవాదులకు స్వర్గం” అని ఎవరో అన్నారని, ఈ వీడియో చూస్తే అది నిజమే అనిపిస్తుందని కర్రు అనే యూజర్ కామెంట్ చేశారు.KK-002 అనే యూజర్ టాక్స్ సిస్టమ్ పై విమర్శలు గుప్పించారు.“జీతం తీసుకునే వాళ్ళను మాత్రం పన్నులతో పిండేస్తారు.కోట్లు సంపాదించే చాలామంది ప్రొఫెషనల్స్ మాత్రం టాక్స్ లు సరిగ్గా కట్టరు” అని మండిపడ్డారు.

మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది.న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, ఆదాయ అసమానతలు తగ్గించాలని, అందరికీ న్యాయం అందేలా చూడాలని డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube