ఈ సృష్టిలో మనుషులకు ప్రకృతికి ఎంతో విడదీయరాని బంధం ఉంది.మనుషుల జీవితాలను ఎంతో అద్భుతంగా ఈ ప్రకృతి మనకు వివరిస్తుంది.
ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి.ప్రకృతిలో కేవలం వింతలు అద్భుతాలు మాత్రమే కాకుండా మతపరమైన ప్రాముఖ్యతలను కూడా సంతరించుకుని ఉన్నాయి.
సాధారణంగా మన పురాణాలను మనం.మహాభారతం, రామాయణం, భాగవతం వంటి గ్రంథాల ద్వారా తెలుసుకున్నాము.కానీ ఇలాంటి అద్భుతమైన చరిత్రలను ప్రకృతి మనకు తెలియజేస్తుంది.ఎంతో విశిష్టత కలిగిన మహాభారతాన్ని ఒక పువ్వు మనకు తెలియజేస్తుంది.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.మహాభారతాన్ని తెలియజేసే ఆ పువ్వు ఏంటి ? ఆ పువ్వు ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
మన హిందూ ధర్మంలో పంచమవేదంగా ఎంతో ప్రసిద్ధి చెందిన మహాభారతం మొత్తం ఒక పువ్వులో ఏర్పడి ఉంది.చూడటానికి ఎంతో అందంగా కనిపించే ఈ పుష్పంలో ఎన్నో వింతలు ఉన్నాయి.అంత విశిష్టత కలిగిన ఈ పుష్పాన్ని కృష్ణ కమలం అని పిలుస్తారు.వాడుక భాషలో ఈ పుష్పాన్ని కౌరవ పాండవ పుష్పం అని కూడా పిలుస్తారు.ఎంతో విశిష్టత కలిగిన ఈ పుష్పం ఏడాది మొత్తం మనకు కనిపించదు.
కేవలం మూడు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పుష్పించడం ఈ కృష్ణ కమలం ప్రత్యేకత.కౌరవులు, పాండవులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ ఈ పుష్పం లోనే దాగి ఉన్నారని చెప్పవచ్చు.

చూడటానికి ఎంతో చిన్నగా తెలుపు రంగులో ఆహ్లాదంగా కనిపించే ఈ పుష్పంలో ఇంత సమాచారం ఇమిడి ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఇది పుష్పం చుట్టూ చిన్నని పుసన్నని తీగవంటి రేకులు కలిగి ఉంటాయి ఇవి మొత్తం 100 ఉండటంతో వీటిని కౌరవులుగా భావిస్తారు.వీటి పై భాగంలో ఐదు రెక్కలు కలిగి ఉంటాయి.ఈ ఐదు రెక్కలను పాండవులకు సూచిక.ఈ ఐదు రెక్కల పై మూడు రెక్కలు కొలువై ఉంటాయి వీటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా కొలుస్తారు.వీటి కింద భాగంలో సుదర్శనచక్రాన్ని పోలిన ఆకారం ఉంటుంది.
దీనిని శ్రీకృష్ణుడిగా భావిస్తారు.ఇలా ఈ పుష్పంలో మహాభారత సమాచారం ఉండడం చేత ఈ పుష్పాన్ని కౌరవ పాండవ పుష్పం లేదా కృష్ణ కమలం అని కూడా పిలుస్తారు.