వైరల్ వీడియో: అతడి కార్ డ్రైవింగ్ స్కిల్ కి వావ్ అనాల్సిందే..!

కార్ డ్రైవింగ్ చేయడం అంటే మాములు విషయం కాదు ఎందుకంటే డ్రైవింగ్ చేయలన్నగాని, కార్ పార్కింగ్ చేయాలన్నగాని దానికి ఎంతో అనుభవం ఉండాలి.లేదంటే ఎదుటి వారి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంటుంది.

 Viral Video: Wow Analsinde To His Car Driving Skill Viral Video, New Yorker ,dr-TeluguStop.com

అయితే ఒక్కోసారి మనం ఎక్కడికైన వెళ్ళినప్పుడు కారు పార్కింగ్ చేయవలిసిన అవసరం వస్తుంది.అలాంటప్పుడు పార్కింగ్ లో ఉన్న కార్లను తీయడంలో కొంతమంది నానా తంటాలు పడతారు.

ఎందుకంటే కార్ పార్కింగ్ లో పెట్టినప్పుడు ముందు వెనుక, ఒకదాని తరువాత ఒకటి అలా వాహనాలను ఒక వరుస క్రమంలో పార్కింగ్ చేయిస్తారు.అలాంటప్పుడు ఎంతో జాగ్రత్తగా పార్కింగ్ లో ఉన్న వాహనాలను తీయాలి.

అయితే ఒక వ్యక్తి మాత్రం రెండు కార్ల మధ్యనున్న తన కారును ఎంతో చాకిచక్యంగా తీసేసాడు.ప్రస్తుతం ఈ కార్ పార్కింగ్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

అసలు ముందు వెనుక కార్లు పార్క్ చేసి ఉన్నాయి.మధ్యలో ఉన్న కార్ తీయాలంటే అది అసాధ్యమైన పనే కానీ, ఈ వీడియోలో కనిపించే వ్యక్తి మాత్రం చాలా సింపుల్ గా రెండు కార్లకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తన కార్ ను తీసేసాడు.

న్యూయార్క్ నగరంలోని ఒక ప్రాంతంలో పార్కింగ్ ఏరియాలో కార్లను ఒకదాని వెనుక ఒకటి పార్కింగ్ చేశారు.

అయితే కార్లను పార్కింగ్ చేసే క్రమంలో కార్ల మధ్య కొంచెం గ్యాప్ ఉంటే పర్లేదు కానీ.మూడు కార్లు కొద్ది కొద్ది దూరంలోనే ఒకదాని తర్వాత ఒకటి పార్క్ చేశాయి.మధ్యలో ఉన్న కారును తీయాలని ఓ వ్యక్తి వచ్చాడు.

కానీ అక్కడ పరిస్థితి చూసి కార్ ఎలా తీయాలా అని ఆలోచనలో పడ్డాడు.అయినా కారును ఎలా అయిన తీయాలని ప్రయత్నించాడు.

కారును మెల్లగా వెనక్కి, ముందుకు కొద్ది కొద్దిగా తిప్పుతూ విజయవంతంగా కారును బయటకు తీశాడు.ఈ క్రమంలో ముందు, వెనుక ఉన్న కార్లకు ఒక్క చిన్న గీత కూడా పడలేదు అంటే ఆశ్చర్యంగా ఉంది కదా.ఇందుకు సంబంధించిన వీడియోను పీపుల్ ఇన్స్ట్రాగ్రామ్ లో ఈ కార్ పార్కింగ్ వీడియోను పోస్టు చేశారు.ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అతని కార్ డ్రైవింగ్ నైపుణ్యాన్ని అభినందించకుండా ఉండలేరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube