1.చంద్రబాబు అరెస్టును జాతీయ నేతలు ఖండించాలి

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు జాతీయ నేతలు ఖండించాలని ఆ పార్టీ నాయకుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
2.గవర్నర్ తమిళ సై తొలి పుజ
ఖైరతాబాద్ మహాగణపతిని గవర్నర్ తమిళ సై దర్శించుకున్నారు.మహాగణపతి వద్ద తొలి పూజ నిర్వహించారు.
3.చంద్రబాబుతో బ్రాహ్మణి భువనేశ్వరి ములాఖత్

రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ,యనమల రామకృష్ణుడు ములాఖత్ అయ్యారు.
4.బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు.
5. కేంద్రంపై అయ్యన్న విమర్శలు

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ ప్రధాని, హోం మంత్రి కి తెలియకుండానే జరిగిందా అని కేంద్రంపై టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అనుమానం వ్యక్తం చేశారు.
6.ఏపీ విభజనపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఏపీ విభజనపై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోది సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీ విభజన సరిగా జరగలేదని ప్రధాని అభిప్రాయపడ్డారు.
7.జగన్ పై పురందరేశ్వరి విమర్శలు

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు తీరుపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి కామెంట్ చేశారు.ఎన్నికల్లో ఓట్ల కోసం మద్యం గురించి ప్రజల ఆరోగ్యం గురించి జగన్ చాలా గొప్పగా చెప్పారు .నేడు మద్యం ద్వారా వేల కోట్ల అవినీతి జరుగుతుందనేది నిజం అంటూ పురందరేశ్వరి విమర్శించారు.
8.చంద్రబాబు ఆరోగ్యం కోసం భువనేశ్వరి ప్రత్యేక పూజలు
టిడిపి అధినేత చంద్రబాబు ఆరోగ్యం కోసం ఆయన సతీమణి నారా భువనేశ్వరి రాజమండ్రి శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
9.పార్లమెంట్ ఆవరణలో టిడిపి ఎంపీల ధర్నా

పార్లమెంట్ ఆవరణలో టిడిపి ఎంపీలు ఈరోజు ధర్నాకు దిగారు.పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.ఎంపీలతో పాటు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్లమెంటుకు చేరుకుని ఎంపీలతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు.
10.12 జిల్లాలకు భారీ వర్షం సూచన
పశ్చిమ గాలుల ప్రభావం అధికంగా ఉండడంతో తమిళనాడులోని 12 జిల్లాలకు వరుస సూచన ఉందని చెన్నై వాతావరణ కేంద్రం ప్రకటించింది.
11.టిడిపి మహా ధర్నా

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ ప్రభుత్వం తీరును ఎండగడుతూ చెన్నైలోని తెలుగువారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు మంగళవారం మహా ధర్నా చేపట్టనున్నారు.
12.అయోష మీరా తల్లిదండ్రులను ప్రశ్నించిన సిబిఐ
తెనాలిలో సిబిఐ అధికారులు అయోష మీరా ఇంటికి వచ్చారు.తల్లిదండ్రులు శంషాద్ బేగం, భాషతో కేసుకు సంబంధించిన విషయాలపై ఆరా తీశారు.
13.ఇందిరా పార్క్ వద్ద ఆర్టీసీ కార్మికుల ధర్నా

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఏడేళ్లుగా రావాల్సిన బకాయిలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26 న ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ తెలిపారు.
14.ప్రధానికి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
15.బిజెపి మద్దతుతోనే చంద్రబాబు అరెస్ట్

బిజెపి మద్దతుతోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిందని సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు.
16.జగన్ పై రాజాసింగ్ విమర్శలు
టిడిపి అధినేత చంద్రబాబు అంటే ఏపీ సీఎం జగన్కు భయమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజా సింగ్ సెటైర్లు వేశారు.
17.గద్దర్ కుటుంబ సభ్యులకు సోనియా ఓదార్పు

గద్దర్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ పరామర్శించారు.
18.ఇంటింటికి గ్యారెంటీ కార్డుల పంపిణీ
ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ , ఆ గ్యారెంటీ కార్డుకు ‘ అభయ హస్తం ‘ అని పేరు పెట్టింది.
19.శ్రీవారి సేవలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి డీజీపీ రాజేందర్ నాథ్ రెడ్డి దర్శించుకున్నారు.
20.శ్రీవారి బ్రహ్మోత్సవాలకు జగన్
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏపీ సీఎం జగన్ హాజరు కానున్నారు.తిరుపతి రేణిగుంట విమానాశ్రయం కు జగన్ చేరుకున్నారు.