గ్రీస్‌లో మనోడికి ఘోర అవమానం.. యూరప్‌లో భారతీయులపై వివక్ష పెరిగిపోతోందా?

జర్మనీలో(Germany) ఉంటున్న ఓ ఇండియన్ వ్యక్తికి యూరప్ (Europe)ట్రిప్‌లో, ముఖ్యంగా గ్రీస్‌లో భయంకరమైన అనుభవం ఎదురైంది.తన దేశం (భారత్)(india) పేరు చెప్పగానే జాత్యహంకారంతో ఎగతాళి చేశారంటూ రెడిట్‌లో తన ఆవేదనను పంచుకున్నాడు.

 A Terrible Insult To Manodi In Greece.. Is Discrimination Against Indians Incre-TeluguStop.com

చాలా యూరప్ దేశాల్లో భారతీయ వలసదారుల పట్ల వ్యతిరేకత, చిన్నచూపు పెరుగుతోందని వాపోయాడు.అసలేం జరిగిందంటే ఇతను యూరప్‌కి వెళ్లినప్పుడు అంతా బాగుంటుంది, అందరిలాగే ఓ మంచి జీవితం గడుపుదాం అనుకున్నాడట.

కానీ, అక్కడ చాలా మందికి భారతీయులంటే చులకన భావం ఉందని, వాళ్ళు శుభ్రంగా ఉండరని, సరిగ్గా కలిసిపోలేరని అనుకుంటున్నారని త్వరలోనే అర్థమైంది.

Telugu America, Indian, Australia, Canada, Europe, Europeimmigrant, Greeceimmigr

అతడు గ్రీస్‌కు వెళ్లి నప్పుడు పరిస్థితి మరీ దారుణంగా ఉంది.ఎక్కడికి వెళ్లినా తెలియని వాళ్లు కూడా తననే చూస్తూ, చాలా రూడ్‌గా మాట్లాడారట.ఒకసారి అయితే కొందరు ఆపి, “నీ రెసిడెన్స్ పర్మిట్(Residence permit) చూపించు” అని అడిగారు.అతను “నేను జర్మనీలో ఉంటున్నాను” అని చెప్పగానే, వాళ్లు ఎగతాళిగా నవ్వారట.“సరే కానీ, నిజానికి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావ్?” అని మళ్లీ అడిగారు.అతను “ఇండియా” అని చెప్పడంతోనే, వాళ్లు గ్రీకు భాషలో ఏదో మాట్లాడుకుంటూ ఇంకా గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు.ఈ సంఘటన అతన్ని తీవ్రంగా బాధించింది.

ఈ వ్యతిరేకతకు కారణం ఉద్యోగాల భయమేనని అతను నమ్ముతున్నాడు.ఇప్పటికే నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న గ్రీస్‌లో భారతీయులు, పాకిస్థానీలు(Indians and Pakistanis in Greece) ఎక్కువగా ఉండటంతో తమ ఉద్యోగాలు వీళ్లు లాగేసుకుంటున్నారని చాలా మంది గ్రీకులు కోపంగా ఉన్నారని, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని అతను అభిప్రాయపడ్డాడు.

ఈ జాత్యహంకారం ఒక్క గ్రీస్‌లోనే కాదు, తాను ఉంటున్న జర్మనీలోనూ ఉందని, కాకపోతే గ్రీస్‌లో అంత తీవ్రంగా లేదని చెప్పాడు.యూరప్‌లోనే కాకుండా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే (America, Canada, Australia, UK)లాంటి దేశాల్లో కూడా భారతీయుల పట్ల ఇలాంటి నెగటివ్ వైఖరి పెరగడం చాలా బాధాకరమని అన్నాడు.

Telugu America, Indian, Australia, Canada, Europe, Europeimmigrant, Greeceimmigr

ఈ పరిస్థితికి యూరప్ మీడియా కూడా కారణమేనని అతను ఆరోపించాడు.వాళ్లు ఎప్పుడూ ఇండియాలో జరిగే నేరాలు, చెడు సంఘటనలనే ఎక్కువగా చూపిస్తూ, భారత్ గురించి నెగటివ్ ఇమేజ్‌ని క్రియేట్ చేస్తున్నారని వాపోయాడు.అతని పోస్ట్ చూసిన చాలా మంది రెడిట్‌ యూజర్లు రకరకాలుగా స్పందించారు.“ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఆర్థికంగా కష్టాలు వచ్చినప్పుడు వలసదారుల మీద పడటం మామూలే” అని కొందరు అంటే, “యూరప్ మీడియా ఎప్పుడూ ఇండియా గురించి చెడుగానే చూపిస్తుంది, మంచి విషయాలు చెప్పనే చెప్పదు” అని మరికొందరు మీడియాను విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube