సోషల్ మీడియాలో ఒక వీడియో విస్తృతంగా వైరల్ అవుతోంది.ఓ వాచ్‌మెన్ ఒక వీధి కుక్కను(Dog) ప్రేమగా నిమురుతుంటే, అది చూసి తట్టుకోలేని ఇంకో కుక్క అసూయతో అతడిపై దాడి చేసి కరిచేసింది.
ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.వీధి కుక్కల(Stray dogs) ప్రవర్తనపై కొత్త చర్చకు దారితీసింది.
కుక్కలంటే ఇష్టపడే వారు కూడా ఈ వీడియో చూసి ఆలోచనలో పడ్డారు.
ఈ సంఘటన ఓ రెసిడెన్షియల్ సొసైటీ బయట జరిగినట్లు తెలుస్తోంది.
వీడియోలో, గేటు దగ్గర కొన్ని వీధి కుక్కలు కూర్చుని ఉన్నాయి.వాచ్‌మెన్ వాటి దగ్గరికి రాగానే, ఓ కుక్క తోక ఊపుతూ స్నేహంగా దగ్గరికి వచ్చింది.
వాచ్‌మెన్ కూడా ప్రేమగా ఆ కుక్కను నిమరడం మొదలుపెట్టాడు.కానీ, ఈ ప్రేమను చూసి పక్కనే ఉన్న మరో కుక్కకు అసూయ పుట్టుకొచ్చింది.

అంతే, క్షణాల్లో ఆ కుక్క వాచ్‌మెన్‌పైకి(watchman) దూకి అతని చేతిని గట్టిగా కరిచేసింది.విచిత్రం ఏంటంటే, అంతసేపు ప్రేమగా నిమిరించుకున్న కుక్క మాత్రం ఏమీ పట్టనట్టు అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్లిపోయింది.పాపం వాచ్‌మెన్ మాత్రం ఆ కోపంగా ఉన్న కుక్కతో ఇబ్బంది పడ్డాడు.ఈ వీడియోను ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో @gharkekalesh అనే పేజీ షేర్ చేసింది.ఇప్పటికే 22,300 సార్లుకు పైగా దీన్ని చూశారు.ఇంకా చూస్తూనే ఉన్నారు.
నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.కొందరు భయం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు అసలు ఆ కుక్క ఎందుకు అలా దాడి చేసిందో అని ఆశ్చర్యపోతున్నారు.

ఒక యూజర్, “కుక్క ప్రేమికులు ఎవరైనా చెప్పగలరా? ఒక కుక్కను నిమురుతుంటే ఇంకో కుక్క ఎందుకు దాడి చేసింది?” అని ప్రశ్నించారు.ఇంకొకరు “చాలా భయానకంగా ఉంది” అని కామెంట్ పెట్టారు.మరో వ్యక్తి, “అసూయ అంటే ఇదేనేమో.ఒకదానికి ప్రేమ దొరికితే, రెండోది కరిచింది” అని రాశారు.ఈ వీడియోతో వీధి కుక్కల పట్ల ప్రేమ చూపించాలా వద్దా అనే చర్చ మళ్లీ మొదలైంది.కొంతమంది నెటిజన్లు, వీధి కుక్కలతో మరీ ఎక్కువగా స్నేహం చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.
ఎందుకంటే అవి కొన్నిసార్లు ఊహించని విధంగా లేదా తమ ప్రాంతాన్ని కాపాడుకునే క్రమంలో దూకుడుగా ప్రవర్తించవచ్చని అభిప్రాయపడుతున్నారు.







