ప్రజలను కరోనా భయం వెంటాడుతోంది.ప్రతిరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.
దీంతో చాలామంది కరోనా సోకకుండా ఉండేందుకు సులువైన మార్గాలను అన్వేషిస్తున్నారు.డి విటమిన్ తక్కువగా ఉన్నవారికే కరోనా ఎక్కువగా సోకుతుందని పలు పరిశోధనల్లో వెల్లడి కావడంతో డి విటమిన్ ట్యాబ్లెట్లను ఎక్కువగా తీసుకుంటున్నారు.
అయితే డి విటమిన్ ట్యాబ్లెట్లను ఎక్కువగా తీసుకుంటే మరీ ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.శరీరంలో డి విటమిన్ ఎక్కువైతే కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని.వీళ్లు కిడ్నీ సంబంధిత సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడిస్తున్నారు.రక్తంలో 50 నానోగ్రామ్ /మి.లీ.కంటే విటమిన్ డి ఎక్కువగా ఉండకూడదని.డి విటమిన్ ఎక్కువైతే కిడ్నీ ఫెయిల్యూర్ కు దారి తీస్తుందని చెబుతున్నారు.
వైద్యుల సలహా మేరకు డి విటమిన్ ట్యాబ్లెటను తీసుకోవాలని ఇమ్యూనిటీ బూస్టర్లను సైతం విరివిగా వాడవద్దని తెలుపుతున్నారు.
మోతాదుకు మించి డి విటమిన్ ను తీసుకుంటే సైడ్ ఎఫెక్టులు ఉంటాయని సూచిస్తున్నారు.విటమిన్ డి ఎక్కువైతే శరీరంలో క్యాల్షియం స్థాయిలు పెరుగుతాయని తద్వారా రక్తపోటు, ఆకలి తగ్గిపోవడం లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
విటమిన్ డి ఎక్కువగా తీసుకుంటే ఎముకలపై వ్యతిరేక ప్రభావం పడుతుందని.వికారం, వాంతులు లాంటి సమస్యలు తలెత్తుతాయని తెలుపుతున్నారు.
సాధారణంగా వైరస్, బ్యాక్టిరియా, ఫంగస్ నుంచి డి విటమిన్ రక్షిస్తుందని.అందువల్లే వైద్యులు సైతం డి విటమిన్ ను తీసుకోవాలని సూచిస్తున్నారని.
అయితే పరిమితికి మించి డి విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకోవడం మాత్రం ఆరోగ్యానికి అన్ని విధాలుగా చేటు చేస్తుందని మోతాదు మించితే విటమిన్లే విషమవుతాయని సూచిస్తున్నారు.శరీరంలో డి విటమిన్ ఎక్కువైతే లక్షణాలు వెంటనే కనిపించవని.
లక్షణాలు కనిపించడానికి చాలా రోజుల సమయం పడుతుందని నిపుణులు తెలిపారు.