స్వచ్ఛమైన మనసు, వారి వైపు న్యాయం ఉన్నవారు ఎవరైనా వారాహి దేవిని( Goddess Varahi ) పూజించవచ్చు.అయితే ఈ వారాహి దేవిని పంచమి తిథుల్లో పూజిస్తే వారికి స్వరాభిష్టాలు చేకూరుతాయి.
నిస్వార్ధమైన అభ్యర్థనను వారాహి దేవి వెంటనే నెరవేరుస్తుంది.అయితే వక్ర బుద్ధితో, ఇతరులకు హాని కలిగించే ఉద్దేశంతో ఉన్నవారికి మాత్రం వారాహి దేవిని పూజించే అర్హత లేదు.
అలాంటి వారు కచ్చితంగా నాశనం అవుతారు.అయితే శుక్లపక్షం పంచమి( Shuklapaksha Panchami ) మే తొమ్మిదవ తేదీన వస్తోంది.
అయితే మంగళవారం తో పాటు వచ్చే ఈ రోజు వారాహి దేవికి ఏ నైవేద్యాన్ని సమర్పించి పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వారాహి అమ్మేవారికి ఎప్పటిలాగానే ప్రతిమ లేదా విగ్రహం లేకపోయినా కూడా పూజించవచ్చు.దీపం వెలిగించి అందులో వారాహి అమ్మవారు ఉన్నారని భావించాలి.అలాగే ఆమెను శ్రద్ధతో పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.
అంతేకాకుండా పూజలు చేసే సమయంలో అమ్మవారికి నైవేద్యంగా ఎర్రని దానిమ్మ పండు గింజలను అలాగే తమలపాకు, పువ్వులను, పండ్లను సమర్పించవచ్చు.ఇక మందార పువ్వులు( Hibiscus flowers ) సమర్పిస్తే చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు.
అంతేకాకుండా వారాహి అమ్మవారికి కొబ్బరి పువ్వును సమర్పించడం వలన మీ ఇంట్లో, మీ జీవితంలో ఎలాంటి సమస్యలు, ఎన్ని బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయి.

ఇక మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు కూడా దూరం అవుతాయి.అయితే కొన్ని చోట్ల కొబ్బరి పువ్వును విడిగా విక్రయిస్తారు.ఆ కొబ్బరి పువ్వును కొనుగోలు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు.
ఒకవేళ కొబ్బరి పువ్వు( coconut flower ) లేకుంటే కొబ్బరి తురుములో కాసంత బెల్లం వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు.ఇలా చేయడం వలన వ్యాపారంలో సమస్యలు, శత్రుబాధలు, నరదృష్టి, తీరని రోగం, రుణ బాధలు మొదలైనటువంటి ఎన్నో రకాల సమస్యలకు తక్షణమే పరిష్కారం లభిస్తుంది.
అందుకే స్వచ్ఛమైన మనసుతో అమ్మవారికి కొబ్బరి పువ్వును సమర్పించాలి.