కన్నడ హీరోయిన్ పై దాడి చేసిన కవితా రెడ్డి అరెస్ట్

బెంగుళూరులో పార్క్ లో జాగింగ్ చేసుకుంటూ ఉండగా కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డేని మాటలతో దూషించడమే కాకుండా దాడి చేసిన కాంగ్రెస్ నాయకురాలు కవితా రెడ్డిని బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.మూడు రోజుల క్రితం పార్క్ లో స్పోర్ట్స్ బ్రాతో జాగింగ్ చేస్తున్న సంయుక్త, ఆమె స్నేహితురాలిపై కవితా దాడి చేసింది.

 Kavitha Reddy Arrested For Attacking Actress Samyuktha, Bangalore, South Heroine-TeluguStop.com

అందరూ వచ్చే పార్క్ లో ఇలాంటి డ్రెస్ తో ఎలా జాగింగ్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇష్టానుసారంగా దూషించడంతో పాటు, సంయుక్త స్నేహితురాలిపై దాడి చేసింది.

ఈ ఘటనని సంయుక్త వీడియో ద్వారా షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.తాము ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో కూడా చెబుతారా అంటూ తన ఆవేదనని తెలియజేసింది.

ఈ ఘటనకి సంబందించిన వీడియో వైరల్ కావడంతో చాలా మంది సెలబ్రిటీలు కవితా రెడ్డిపై విమర్శలు చేశారు.

సినిమా వాళ్ళు అందరూ కూడా ఇలా డ్రగ్స్ బానిసలు అంటూ కవితా రెడ్డికి మద్దతుగా సంయుక్తపై దాడి చేశారు.

పోలీసులు అడ్డుకోవడంతో అప్పటికి గందరగోళం తప్పింది.తరువాత సంయుక్త పోలీసులకి ఫిర్యాదు చేసింది.

తరువాత కవితా రెడ్డి వీడియో ద్వారా సంయుక్తకి క్షమాపణలు చెప్పింది.సంయుక్త కూడా ఆమె అంగీకరిస్తున్నట్లు తెలిపింది.

అయితే ఊహించని విధంగా పోలీసులు ఆ ఘటనపై కవితా రెడ్డిని అరెస్ట్ చేశారు.పార్క్ లో జరిగిన దాడిలో కవితా రెడ్డిదే తప్పని నిర్ధారించుకున్న పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు.

మరి ఈ అరెస్ట్ పై సంయుక్త హెగ్డే ఎలా రియాక్ట్ అవుతుంది అనేది వేచి చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube