బిగ్ బాస్( Big Boss ) తెలుగు.ప్రపంచంలోనే అతిపెద్ద రియాలిటీ షో అంటూ తెలుగు టీవీ ఇండస్ట్రీకి ఎంట్రీ వచ్చింది.
ఈ షో ఉద్దేశం ఏంటో కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.దాదాపు 15 నుంచి 18 మంది సెలెబ్రిటీస్ ( Celebrities )మరియు కొంతమంది కామన్ పీపుల్ ని కలిపి ఒక సీజన్ కి సెలెక్ట్ చేసి వారిని హౌస్ లో కి పంపించి వారం చొప్పున ఒకరిని ఎలిమినేట్ చేసి ఇంటికి పంపిస్తూ ఉంటారు.
అలా చివరికి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ మాత్రమే మిగులుతారు వారిలోంచి ఒకరికి బిగ్ బాస్ విన్నింగ్ ట్రోఫీ ఇస్తారు.

వీరందరినీ ఒక ఇంట్లో పెట్టి వారి చేత గేమ్స్, ఫన్ చేయించి జనాలను ఎంటర్టైన్ చెయ్యాలనేది బిగ్ బాస్ యొక్క ముఖ్య ఉద్దేశం.అయితే తెలుగులో ప్రస్తుతం బిగ్ బాస్ అతిపెద్ద ఫ్లాప్ షో గా నిలిచిపోయింది దాంతో యాజమాన్యం తల పట్టుకున్నారు.బిగ్ బాస్ షో కి ఎలా అయినా తిరిగి ఆదరణ దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.
అందుకోసం ఈ సీజన్ కి ప్రత్యేకంగా ఉల్టా పుల్తా అనే పేరు పెట్టుకుని మరి రకరకాల కార్యక్రమాలు చేస్తున్న అది వర్క్ అవుట్ అవ్వడం లేదు.ఈసారి ముందు సీజన్స్ కి భిన్నంగా రెండవ పార్ట్ లాగా ఒకేసారి ఐదు వైల్డ్ కార్డు ఎంట్రీ( Five wild card entries ) లను పెట్టినా కూడా అది పెద్దగా జనాలకు నచ్చలేదు.

దాంతో ఇక తల పట్టుకున్న యాజమాన్యం బిగ్ బాస్ గొంతుకు ప్రాముఖ్యత ఉన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని ఈసారి బిగ్ బాస్ చేత కామెడీ చేయించాలని డిసైడ్ అయ్యారు.గత వారం రోజులుగా గమనిస్తే ప్రతి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఏదో ఒక రకంగా కామెడీ చేస్తున్నాడు కంటెస్టెంట్స్ ఎలాగూ చేయడం లేదు కాబట్టి బిగ్ బాసే కామెడీ మొదలు పెట్టాడంటూ సెటైర్స్ కొంతమంది వేస్తున్న అందులో నిజం లేకపోలేదు.దాంతో ఎంతో కొంత ఫన్ కూడా కనిపిస్తోంది బిగ్ బాస్ వేస్తున్న పంచులకి జనాలు నవ్వుతున్నారు ఈ కామెడీ వర్కౌట్ అయ్యేలా కనిపిస్తుండడంతో ఈ విధంగానే మరికొన్ని రోజులు కంటిన్యూ చేయాలని యాజమాన్యం భావిస్తుందట ఏది ఏమైనా కంటెస్టెంట్స్ కన్నా బిగ్ బాస్ మంచి కమెడియన్ గా పేరు సంపాదించుకునేలా ఉన్నాడు మరి.