ఒక్కరోజు నిద్ర పోకుంటే మెదడులో అలా జరుగుతుందా.. చాలా ప్రమాదమంటూ?

మనలో చాలామంది నిద్ర విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు.వర్క్, ఇతర కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో రోజంతా మేలుకొని ఉంటారు.

 Sleep Disorders In Diseases Of The Central Nervous System,sleeping,central Nervo-TeluguStop.com

మరి కొందరు వృత్తిపరమైన కారణాల వల్ల నిద్ర విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.ప్రతి మనిషికి రోజుకు 6 నుంచి 8 గంటల పాటు ప్రశాంతమైన నిద్ర అవసరమైన సంగతి తెలిసిందే.

వయస్సును బట్టి నిద్రించే సమయం విషయంలో స్వల్పంగా మార్పులు ఉంటాయి.

నిద్ర విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎన్నో వ్యాధుల బారిన పడే అవకాశం అయితే ఉంటుంది.

శాస్త్రవేత్తలు సైతం నిద్రకు సంబంధించిన ఎన్నో ప్రయోగాలు చేసి షాకింగ్ విషయాలను వెల్లడించారు.తాజాగా శాస్త్రవేత్తలు ఒక్కరోజు రాత్రంతా నిద్ర పోకుండా ఉంటే మెదడులో ఊహించని మార్పులు జరుగుతాయని చెప్పుకొచ్చారు.

ఒక్కరోజు నిద్ర పోకుండా ఉంటే మన ప్రవర్తన ఒకటి లేదా రెండేళ్లు పెరిగిన వాళ్ల ప్రవర్తనలా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

ఒకరోజు రాత్రంతా నిద్రపోని వాళ్లు మరుసటిరోజు నిద్రపోయినా ఎలాంటి సమస్య ఉండదని నిద్ర పోకుండా ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవని జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్ తెలిపింది.సరైన నిద్ర లేకపోతే మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. 134 మందిపై ప్రయోగం చేసి శాస్త్రవేత్తలు ఈ ఫలితాలను వెల్లడించడం గమనార్హం.

మరీ ఎక్కువ సమయం నిద్రపోవడం కూడా మంచిది కాదని నిద్ర విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.నిద్రకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లు వైద్యులను సంప్రదించి ఆ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.ఒక్కరోజు నిద్ర పోకుంటే మెదడులో మార్పులు చోటు చేసుకుంటాయని వైద్యులు వెల్లడిస్తున్నారు.నిద్ర రాకపోతే అందుకు థైరాయిడ్ ఇతర ఆరోగ్య సమస్యలు కారణమయ్యే అవకాశం ఉంది.అన్ని వయస్సుల వాళ్లకు సరైన నిద్ర ఎంతో అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube