ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఈ ఒక్క అల‌వాటే అనేక స‌మ‌స్య‌ల‌ను తెస్తుంది..జాగ్ర‌త్త‌!

ప్రెగ్నెన్సీ.పెళ్లైన ప్ర‌తి స్త్రీకి ఎంతో ప్ర‌త్యేక‌మైన ఘ‌ట్టం.తాను ప్రెగ్నెంట్ అని తెలియ‌గానే.ఎప్పుడూ లేని జాగ్ర‌త్త‌ల‌న్నీ తీసుకుంటారు.కాలికి వేసుకునే చెప్పుల ద‌గ్గ‌ర నుంచి తినే ఫుడ్ వ‌ర‌కు.అన్నిటిల్లో ప్ర‌త్య‌క శ్ర‌ద్ధ వ‌హిస్తారు.

 This Single Habit During Pregnancy Brings Many Problems! Pregnant Women, Pregnan-TeluguStop.com

అయితే కొంద‌రు మాత్రం ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ప్ర‌స‌వం స‌క్ర‌మంగా జ‌రుగుతుందా.? లేదా.?, బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందా లేదా.ఇలా అన‌వ‌స‌ర‌మైన విష‌యాల గురించి ఆలోచిస్తూ ఒత్తిడిని పెంచేసుకుంటారు.

ఈ అల‌వాటు చాలా మందికి ఉంటుంది.

అయితే వాస్త‌వానికి ఈ ఒక్క అల‌వాటే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో అనేక స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడుతుంది.

ఒత్తిడి కార‌ణంగా గ‌ర్భిణీ స్త్రీల‌లో ర‌క్త‌పోటు స్థాయిలు అదుపు త‌ప్పుతాయి.నెల‌లు నిండ‌క ముందే డెలివ‌రీ అయ్యే అవ‌కాశాలు ఉంటాయి.

క‌డుపులోని బిడ్డ ఎదుగుద‌ల దెబ్బ తింటుంది.గర్భస్థ శిశువు చాలా త‌క్కువ వెయిట్‌తో పుట్ట‌డం వంటి స‌మ‌స్య‌లను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

అలాగే గర్భిణీలు ఒత్తిడికి గురైతే శిశువు మెదడు, గుండె ఎదుగుదలపై దుష్ప్రభావం పడుతుంది.ఒక్కోసారి ఒత్తిడి కార‌ణంగా మిస్ క్యారేజ్ అయ్యే ప్ర‌మాదం కూడా ఉంటుంది.

అందుకే ప్రెగ్నెన్సీ టైమ్‌లో వీలైనంత వ‌ర‌కు ఒత్తిడికి దూరంగా ఉండాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.అందుకోసం ప్ర‌తి రోజు ఉద‌యం, సాయంత్రం ప్ర‌శాంత‌మైన ప్ర‌దేశంలో కూర్చుని క‌నీసం ప‌దిహేను నిమిషాలైనా ధ్యానం చేయాలి.

Telugu Problems, Tips, Latest, Pregnancy, Pregnant, Stress-Telugu Health Tips

పిచ్చి పిచ్చి వాటి గురించి ఆలోచించ‌డం మానేసి.కొత్త కొత్త విష‌యాల‌ను తెలుసుకునేందుకు, నేర్చుకునేందుకు ప్ర‌య‌త్నించాలి.త‌ద్వారా ఒత్తిడి ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.అలాగే ఎప్పుడూ ఒంట‌రిగా కూర్చోకుండా కుటుంబస‌భ్యుల‌తో, స్నేహితుల‌తో టైమ్ స్పెండ్ చేయాలి.కంటి నిండా నిద్ర పోవాలి.మ‌రియు ఫోన్‌ను వినియోగించ‌డం కూడా త‌గ్గించి మంచి మంచి పుస్త‌కాల‌ను చ‌ద‌వ‌టం అల‌వాటు చేసుకోవాలి.

వీటి వ‌ల్ల ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు.ఫ‌లితంగా, త‌ల్లీ.

క‌డుపులోని శిశువు ఆరోగ్యంగా ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube