ప్రస్తుత రోజుల్లో రోజంతా ఎనర్జిటిక్ గా ఉండటం అనేది దాదాపు ప్రతి ఒక్కరికి అసాధ్యంగా మారింది.చాలా మందికి మధ్యాహ్నానికి నీరసం వచ్చేస్తుంటుంది.
మరికొందరు సాయంత్రం నాలుగు గంటలకే అలసటతో ఆగమాగం అవుతుంటారు.దీంతో చేసే పనిపై ఏకాగ్రత దెబ్బతింటుంది.
అందుకే రోజంతా ఎనర్జిటిక్ గా మరియు యాక్టివ్ గా ఉండడం కోసం ప్రయత్నిస్తుంటారు.అయితే అందుకు కొన్ని కొన్ని ఆహారాలు ఎంతో అద్భుతంగా సహాయపడుతూ ఉంటాయి.
అటువంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయే స్మూతీ కూడా ఒకటి.
డైట్ లో ఈ స్మూతీని కనుక చేర్చుకుంటే రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.
నీరసం, అలసట అన్న మాటే అనరు.ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ని ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఓ చూపు చూసేయండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు కొబ్బరి ముక్కలు, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో కొబ్బరి పాలు సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక యాపిల్ తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ లో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, అర అంగుళం పీల్ తొలగించిన అల్లం ముక్క, నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు మరియు ఒక గ్లాస్ కొబ్బరిపాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్తీ స్మూతీ సిద్ధమవుతుంది.ఈ ఆపిల్ కోకోనట్ స్మూతీ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవాలి.

ఈ స్మూతీని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ తో పాటు ఎన్నో విలువైన పోషకాలు లభిస్తాయి.రోజంతా బాడీ ఎనర్జిటిక్ మరియు యాక్టివ్ గా ఉండటానికి సరిపడా శక్తిని ఈ స్మూతీ ద్వారా పొందొచ్చు.బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీ తీసుకుంటే నైట్ నిద్రించే వరకు ఎంతో ఎనర్జిటిక్ గా పని చేస్తారు.
నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి కూడా రావు.పైగా ఈ స్మూతీని తీసుకోవడం వల్ల మరో సూపర్ బెనిఫిట్ ఏంటి అంటే బెల్లీ ఫ్యాట్ మాయం అవుతుంది.
బాన పొట్ట కొద్ది రోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది.
.