వర్షాకాలం( Rainy Season ) మొదలైంది.మండే ఎండల నుంచి చక్కటి ఉపశమనాన్ని అందించేందుకు మెల్లమెల్లగా వర్షాలు పడుతున్నాయి.
వర్షపు చిరుజల్లులు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తాయి.అయితే వర్షాకాలం వస్తూ వస్తూనే ఎన్నో జబ్బులను మోసుకొస్తుంది.
ఈ వర్షాకాలంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న అనేక సమస్యలు తలెత్తుతుంటాయి.జలుబు, ఫ్లూ, దగ్గు వంటి అంటు వ్యాధులతో పాటు మలేరియా, డెంగ్యూ( Dengue ) ఇలా ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు వర్షాకాలంలోనే వేధిస్తుంటాయి.
వీటికి దూరంగా ఉండాలి అంటే కచ్చితంగా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.మరి ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం పదండి.
సాధారణంగా చాలా మంది వర్షాకాలమే కదా అని వాటర్ ను పెద్దగా తాగరు.ఇలా చేస్తే మీరు జబ్బులను ఆహ్వానించినట్లే అవుతుంది.బాడీ హైడ్రేటెడ్( Body Hydrate ) గా ఉంటే అనేక జబ్బులకు దూరంగా ఉండొచ్చు.కాబట్టి వర్షాకాలం అయినా సరే వాటర్ తాగడం మాత్రం తగ్గించకండి.అలాగే ఈ వర్షాకాలంలో రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచుకోవాలి.అందుకోసం పసుపు, జీలకర్ర, ధనియాలు, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క( Cinnamon ) వంటి మసాలా దినుసులను డైట్ లో చేర్చుకోండి.
వీటిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ సిస్టమ్( Immunity System ) ను సూపర్ స్ట్రాంగ్ గా మారుస్తాయి.దాంతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.సీజనల్ గా దొరికే కూరగాయలు పండ్లు ఎక్కువగా తీసుకోండి.రెగ్యులర్ గా ఏదో ఒక హెర్బల్ టీ ని తయారు చేసుకుని తీసుకోండి.వర్షం పడుతుందని చెప్పి వ్యాయామాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు.
రెగ్యులర్ గా కనీసం 20 నిమిషాలు అయినా వర్కౌట్ చేస్తే బాడీ ఫిట్ గా, హెల్తీగా ఉంటుంది.
రోగాలు వచ్చే రిస్క్ తగ్గుతుంది.వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి.
అలాగే బయట ఆహారాలను ఈ వర్షాకాలంలో కంప్లీట్ గా ఎవైడ్ చేయండి.రెగ్యులర్ డైట్ లో వెల్లుల్లి, ఉల్లిపాయలు, అల్లం( Garlic, Onions,Ginger ) వంటి ఆహారాలు కచ్చితంగా ఉండేలా చూసుకోండి.
ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.వర్షాకాలంలో వచ్చే అనేక జబ్బులను అడ్డుకుంటాయి.