Writers : సినిమా ఇండస్ట్రీ లో క్రియేటివ్ రైటర్స్ ఎక్కడ ఉన్నారు.? అంతా

రచయిత ….ఈ పేరు చెబితే మరికొన్ని రోజుల్లో బూతు పదంగా మారిపోయే అవకాశం ఉంది.

 There Are No Writers In Tollywood-TeluguStop.com

రచయిత అనేవాడు ప్రస్తుతం లేడు.ఎవరికి వారు దర్శకులు తమ టీం ను పెట్టి గోస్ట్ రైటర్లను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు.

టాలీవుడ్( Tollywood ) లో ఇప్పుడు ఉన్న ప్రతి దర్శకుడికి ఒక రచన విభాగం ఉంది.దాని ద్వారా వచ్చిన ఒక మంచి కథను తన పేరే వేసుకొని కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం అంటూ పేరు వేసుకుని సంబరపడిపోతుంటారు.

నిజానికి ఇప్పుడు రచయిత అనేవాడు ఒక కాపీ పేస్ట్ బ్యాచ్ మాత్రమే.హాలీవుడ్ సినిమాలను తీసుకొని అక్కడ సీన్లు ఇక్కడ పెట్టేసి వాటిని మన నేటివిటీ లో తీస్తూ దర్శకులు సొమ్ము చేసుకుంటున్నారు.

Telugu Krish, Hollywood, Kondapolam, Puri Jagannath, Rajamouli, Sukumar, Tollywo

రాజమౌళి( Rajamouli )ని ఉదాహరణగా తీసుకుంటే తాను హాలీవుడ్( Hollywood ) సన్నివేశాల ద్వారా ప్రేరణ పొంది వాటిని ఇక్కడ ప్రయోగిస్తాను అంటూ ఇంటర్వ్యూలో చెప్తూ వస్తున్నారు.ఒకవేళ అలా తీసుకోకపోయినా ఆయన ఇంట్లో పెద్ద ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా ఉన్నారు.కథ దొరక్కపోతే నైట్ ఏదో ఒకటి చేసేయగల సత్తా ఉంది వారికి.ఇక పూరి జగన్నాథ్ సైతం చాలామంది గోస్ట్ రైటర్లతో ఎన్నో కథలను రాయిస్తూ ఉంటాడు.

మాటలకు పెట్టింది పేరైన త్రివిక్రమ్ సైతం చాలా సార్లు కాపీ అయిన తోనే సినిమాలు చేస్తూ ఉన్నాడు.ఇక ఒక అద్భుతమైన నవలలను ఎంత దారుణంగా తీయొచ్చు డైరెక్టర్ క్రిష్( Director Krish ) కొండపోలం సినిమా ద్వారా నిరూపించాడు.

సుకుమార్ దగ్గర నుంచి హరీష్ శంకర్ వెళ్లిపోయాక, అలాగే వివి వినాయక్( Vv Vinayak ) దగ్గర నుంచి పరుశురాం వెళ్లిపోయాక వీరి కథా బలం ఖచ్చితంగా తగ్గింది.

Telugu Krish, Hollywood, Kondapolam, Puri Jagannath, Rajamouli, Sukumar, Tollywo

మెడికల్ లాంటి గోస్ట్ రైటర్ల చేత కథల రాయించుకుంటున్న పెద్ద డైరెక్టర్లు కూడా ప్రస్తుతం సినిమాలు తీయలేక విలవిల్లాడిపోతున్నారు.ఇప్పుడు రచయిత ముందున్న ఏకైక లక్ష్యం దర్శకుడు కావడమే.అలా మంచి కథ తీసుకుని వెళ్లి హీరోని ఒప్పిస్తే చాలు ఆటోమేటిక్గా నిర్మాత దొరికిపోతాడు.

పైగా హిట్టుల్లో ఉన్న హీరో అయితే ఇంకా లాభం లేకపోయినా ఫ్లాప్ లో ఉన్నా సరే హీరో అయితే దొరికేస్తాడు.అది కుదరకపోతే ఓటీటి ఉండనే ఉందిగా.

లక్షల బడ్జెట్ తో సినిమా తీసి కోట్లలో లాభం పొందడానికి చాలామంది యువ హీరోలు దర్శకులు ఉవ్విళ్లూరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube