అవి.1955 రోజులు.సినీ నిర్మాత హనుమాన్ ప్రసాద్ ఓ కుర్రాడికి కాల్ చేశాడు.మీరు సినిమాల్లో అవకాశాల కోసం ఫోటోలు పంపించారు కదా.చూశాము.బాగున్నాయి.
మద్రాసుకు వస్తే మేకప్ టెస్ట్ చేస్తామ అని చెప్పారు.ఆ ఫోన్ వచ్చినందుకు ఆ కుర్రాడు ఎంతో సంతోషపడ్డాడు.
కానీ తను అప్పటికే సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ముందుకుసాగుతున్నాడు.సినిమాల్లో రాణించకపోతే ఇబ్బంది అవుతుందో ఏమో అనుకున్నాడు.
విషయం తన మిత్రులకు చెప్పాడు.వారు కూడా వెళ్లాలలనే చెప్పారు.
కానీ అంటూ నసిగాడు ఆ కుర్రాడు.అయితే నీ మిత్రుడు క్రిష్ణ ఎందుకు వెళ్లాడు అని ప్రశ్నించారు తన మిత్రులు.
వారి మాటలకు కన్విన్స్ అయ్యాడు.
సినిమాల్లో నటించడమే ధ్యేయంగా మద్రాసుకు వెళ్లాడు.
అప్పుడే జై ఆంధ్ర ఉద్యమం నడుస్తుంది.మద్రాసులో కూడా ఈ ఉద్యమం భారీగానే కొనసాగుతుంది.
అక్కడ పలువురు తెలుగు హీరోలు కూడా టెంట్లు వేసుకుని దీక్ష చేస్తున్నారు.అక్కడికి వెళ్లిన ఈ కుర్రాడు తన మిత్రుడు క్రిష్ణ గురించి ఆరా తీశాడు.
తను కూడా దీక్షలో ఉన్నట్లు తెలుసకున్నాడు.అక్కడికి వెళ్లి తనను పలకరించాడు.
ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు.
అంతసేపు మాట్లాడుకున్న మద్రాసుకు ఎందుకు వచ్చిండో మాత్రం తను చెప్పలేకపోయాడు.ఆ తర్వాత తన మిత్రుడు ఎందుకు మద్రాసుకు వచ్చాడు? అని కూడా ఆలోచించలేదు.ఓ నాలుగు నెలల తర్వాత సినిమా షూటింగులు మొదలయ్యాయి.
ఆ కుర్రాడే మన సినిమా హీరో అని చెప్పాడు.ఒకరోజు షూటింగ్ అయ్యాక నిర్మాత ఆ కుర్రాడి దగ్గరికి వచ్చి మీ మిత్రుడు ఎప్పటికప్పుడు నీ సినిమా గురించి ఆరా తీస్తున్నాడు అని చెప్పాడు.
నీ మేకప్ టెస్ట్ రోజు కూడా ఫోన్ చేసి నీ గురించి మంచిగా చెప్పాడు అన్నాడు.ఆ మాటలు విని షాక్ అయ్యాడు ఆ కుర్రాడు.
అప్పటి నుంచి క్రిష్ణపై మరెంతో ప్రేమను పెంచుకున్నాడు.ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో కాదు.
మురళీ మోహన్.