వింటర్ సీజన్ ప్రారంభం అయ్యింది.మెల్ల మెల్లగా చలి పెరిగిపోతోంది.
అయితే ఈ సీజన్ లో వివిధ రకాల చర్మ సమస్యలు వేధిస్తూ ఉంటాయి.ముఖ్యంగా స్కిన్ రాషెస్ అనేవి చాలా కామన్ గా ఇబ్బంది పెడతాయి.
ఈ రాషెస్ తీవ్రమైన దురదతో పాటు అసౌకర్యాన్ని కలిగిస్తాయి.ఈ క్రమంలోనే రాషెస్ ను నివారించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలా సులభంగా స్కిన్ రాషెస్ ను వదిలించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం స్కిన్ రాషెస్‌కు చెక్ పెట్టే ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ముఖం చేతులు మరియు ఇంకెక్కడైనా రాషెస్ ఉన్నట్లయితే మొదట కొన్ని ఐస్ క్యూబ్స్ ను తీసుకుని వాటిపై బాగా రుద్దాలి.
మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు రాషెస్ ఉన్న చోట ఐస్ క్యూబ్స్ తో మర్దనా చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు గంధం పొడిని వేసుకోవాలి.అలాగే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు మరియు సరిపడా రోజ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రాషెస్ ఉన్న చోట ఏదైనా బ్రష్ సహాయంతో పూతలా అప్లై చేసుకోవాలి.ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకుని అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇక చివరిగా ఏదైనా మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.ఈ విధంగా రోజుకు ఒకసారి చేస్తే స్కిన్ రాషెస్ ను సులభంగా మరియు వేగంగా నివారించుకోవచ్చు.కాబట్టి ఎవరైతే స్కిన్ రాషెస్ తో సతమతం అవుతున్నారో వారు కచ్చితంగా పైన చెప్పిన చిట్కాలు ఫాలో అవ్వండి.