ప్రస్తుత రోజుల్లో అధిక బరువు( Over Weight ) అనేది చాలా మందికి అతిపెద్ద సమస్యగా మారిపోయింది.వెయిట్ గెయిన్ వల్ల శరీర ఆకృతి అందవిహీనంగా మారడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది.
ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం ప్రత్యేకమైన డైట్ ను ఫాలో అవుతుంటారు.అయితే కొందరు ఎటువంటి డైట్ పాటించకుండా బరువు తగ్గాలని భావిస్తుంటారు.
అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే పొడి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
నిత్యం ఈ పొడిని తీసుకుంటే డైట్ లేకపోయినా వెయిట్ లాస్ అవ్వొచ్చు.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్లు ధనియాలు( Coriander ) వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించి చల్లారపెట్టుకున్న ధనియాలు వేసుకోవాలి.
అలాగే మూడు టేబుల్ స్పూన్లు మునగాకు పొడి( Drumstick Leaves Powder ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ ధనియాలు మునగాకు పొడిని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.
బరువు తగ్గేందుకు ఈ పొడి చాలా బాగా సహాయపడుతుంది.

ఈ పొడిని ఎలా ఉపయోగించాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.ఒక గ్లాసు హాట్ వాటర్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ ధనియాలు మునగాకు పొడిని వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, చిటికెడు పింక్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసి రెండు నిమిషాల పాటు పక్కన పెడితే మన డ్రింక్ అనేది రెడీ అవుతుంది.
రోజు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు ఈ డ్రింక్ ను తీసుకుంటే ఒంట్లో కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.క్రమంగా వెయిట్ లాస్ అవుతారు.
పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా పెరుగుతుంది.

పైగా ఈ డ్రింక్ గుండె పోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.జీర్ణ ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది.కాబట్టి, బరువు తగ్గాలని భావించేవారు తప్పకుండా పైన చెప్పుకున్న పొడిని తయారు చేసుకుని తీసుకోండి.
మరియు షుగర్, మైదా, ఫాస్ట్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్ ను అవాయిడ్ చేయండి.డైట్ పాటించకపోయిన ఆరోగ్యమైన పద్ధతిలో ఇంట్లోనే ఆహారాన్ని వండుకుని తినండి.







