ఏడాదిలోపు పిల్లల సంరక్షణ( Baby Care ) విషయంలో పేరెంట్స్ చాలా కేర్‌ఫుల్‌గా వ్యవహరించారు.వారి ఆరోగ్యం, ఆహారం, నిద్ర, శుభ్రత, భద్రత వంటి అనేక అంశాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యంగా డైట్ పై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాడు.ఏడాదిలోపు బేబీలకు కొన్ని కొన్ని ఆహారాలను( Food ) అస్సలు ఇవ్వకూడదు.
ఎందుకంటే అవి అలర్జీలు, గొంతులో ఇరుక్కుపోవడం, జీర్ణ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి.అటువంటి ఆహారాలేంటో ఇప్పుడు తెసుకుందాం.
ఏడాదిలోపు పిల్లలకు పరిస్థితుల్లోనూ కూడా తేనె( Honey ) ఇవ్వకూడదు.తేనెలో క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బాక్టీరియా ఉండే అవకాశం ఉంది.ఈ బ్యాక్టీరియా పెద్దవారిని ఎఫెక్ట్ చేయదు.కానీ ఏడాదిలోపు పిల్లల్లో విషపూరిత ప్రభావాన్ని కలిగిస్తుంది.
అవును తేనెలో ఉండే క్లోస్ట్రిడియం బోటులినమ్ బాక్టీరియా చిన్నారుల ఆంతర్యవ్యవస్థలో వృద్ధి చెంది, విషపూరితమైన బోటులినం టాక్సిన్ విడుదల చేస్తుంది.ఇది ఇన్ఫంట్ బోటులిజం అనే ప్రమాదకరమైన వ్యాధికి దారితీస్తుంది.

అలాగే ఏడాది లోపు పిల్లలకు ఆవు పాలు, మేక పాలు( Cow, Goat Milk ) అస్సలు పట్టించకూడదు.ఎందుకంటే బేబీల జీర్ణ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందలేదు.అందువల్ల ఆవు లేదా మేక పాలు పిల్లల జీర్ణ వ్యవస్థకు అనుకూలంగా ఉండవు.పైగా ఆవు, మేక పాలలో ఐరన్ చాలా తక్కువ.అందువల్ల తల్లిపాలతో పోలిస్తే ఆవు పాలు లేదా మేక పాలు తాగిన బేబీల్లో ఐరన్ డెఫిషియెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అందుకే ఏడాది లోపు పిల్లలకు తల్లిపాలు లేదా ఫార్ములా మిల్క్ ను మాత్రమే పట్టించాలి.

ఏడాదిలోపు పిల్లలకు ఉప్పు( Salt ) మరియు చక్కెర( Sugar ) కలిగిన ఆహారం ఇవ్వకూడదు.బేబీల యూత్రపిండాలు ఎక్కువ ఉప్పును సహించలేవు.మరియు చక్కెర వల్ల పిల్లలు తల్లిపాలు లేదా పోషకాహారం తినడానికి ఆసక్తి చూపరు.ఇది పిల్లల్లో పోషకాల కొరతకు దారి తీస్తుంది.ఏడాదిలోపు పిల్లకు చక్కెర కలిగి ఆహారం ఇవ్వడం వల్ల భవిష్యత్తులో మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది.
అంతేకాకుండా ఏడాదిలోపు పిల్లలకు బాదం, పిస్తా వంటి నట్స్, సీడ్స్, పల్లీలు, గట్టిపాటి పదార్థాలు ఇవ్వకూడదు.
ఇవి గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది.కృత్రిమ రంగులు, రసాయనాలు కలిగిన ఫుడ్స్, డీప్ ఫ్రై చేసిన ఆహారాలు కూడా ఏడాదిలోపు పిల్లలకు ఇవ్వకూడదు.







