ఆడవాళ్లు ఇదే మీకే... మీరు ఆ సమయంలో తప్పకుండా బెల్లం తినాలి సుమా..!

ఆడవాళ్లకు మాతృత్వం అనేది దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.అమ్మా అనే పిలుపు కోసం.

 Ladies This Is For You  You Must Eat Jaggery At That Time , Women ,eating, Jegee-TeluguStop.com

ఆడవాళ్లు ఎంతగానో పరితపిస్తుంటారు.కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలిసిన దగ్గర నుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

బిడ్డని కడుపులో మోసే సమయంలో శరీరంలో ఎన్ని మార్పులు వచ్చినగాని అన్నిటిని భరిస్తారు.చివరకు పుట్టిన బిడ్డను చూసి పడిన కష్టాలన్నింటిని మర్చిపోతారు.

అయితే గర్భం దాల్చినప్పుడు మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యంగా ఆహారం విషయంలో తల్లి చాలా అప్రమత్తంగా ఉండాలి.

లేదంటే తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి హానికరమే.గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు ముఖ్యంగా బెల్లం తినాలి.

ఎందుకంటే బెల్లంలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది కాబట్టి రక్త హీనత లోపం అనేది ఉండదు.

అలాగే బెల్లం హార్మోన్ల అసమతుల్యతను క్రమ బద్దికరిస్తుంది.

అలాగే గర్భధారణ సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.గర్భధారణ సమయంలో ఆడవాళ్లు బెల్లం తింటే ఇంకా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి.

అవి ఏంటో ఒకసారి చూద్దామా.

బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది .కాబట్టి ఇది రక్త కణాల పెరుగుదలలో బాగా ఉపయోగ పడుతుంది.గర్భిణీలు చక్కెర వాడకాన్ని తగ్గించి బెల్లం వాడడం ఆరోగ్యానికి మంచిది.

బెల్లంలో మెగ్నీషియం ఉండటం వల్ల ఎముకలు దృడంగా మారతాయి.అలాగే బెల్లం తినడం వలన రోగ నిరోధక శక్తి కూడా మెరుగు పడుతుంది.

గర్భధారణ సమయంలో బెల్లం తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు విసర్జించబడతాయి.బెల్లంలో ఉండే యాంటీ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంలో సహాయ పడుతాయి.

గర్భధారణ సమయంలో స్త్రీలు ఏక్కువగా మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు .కావున బెల్లం తింటే అన్ని సమస్యలు దూరం అవుతాయి.బెల్లంలో పొటాషియం, సోడియం మితంగా ఉంటాయి .కాబట్టి ఇవి ఎలక్ట్రోలైట్‌లను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది.మరి గర్భిణీలు బెల్లం ఎప్పుడు తినాలంటే గర్భం దాల్చిన మొదటి రెండు నెలల్లో తల్లికి ఐరన్ ఎక్కువగా అవసరం అవుతుంది కావున ఐరన్ యొక్క అవసరాన్ని చూసి గర్భిణీలు బెల్లం తినాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube