నల్లగొండ జిల్లా: నకిరేకల్ పట్టణంలోని మీని స్టేడియంలో గతంలో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన మినీ వాటర్ ప్లాంట్ పని చేయక మార్నింగ్ వాకర్స్,క్రీడాకారులు,సేద తీరేందుకు వచ్చే పెద్దలు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.
ప్రస్తుతం వేసవి కాలం కావడంతో తాగునీటి ఇబ్బందులు పడుతున్నామని, ఉన్నతాధికారులు స్పందించి వాటర్ ప్లాంట్ మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.







