పవిత్రమైన కార్తీక మాసం ఆదివారం నుంచి మొదలవడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలను దర్శించి పూజలు నిర్వహిస్తుంటారు.ఈ కార్తీకమాసం ఆ పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన మాసం కావడంతో ఆ శివునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు.
మహిళలు ఈ నెల మొత్తం కార్తీక దీపాలను వెలిగించడం వల్ల దీర్ఘ సుమంగళిగా వుంటారని ప్రతీతీ.ఈ కార్తీకదీపాలను వెలిగించడం ద్వారాఎంత పుణ్యం చేకూరుతుందో, అలాగే దానధర్మాలను చేయటం ద్వారా పాపకర్మలు తొలగిపోతాయి.
ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది కావడం చేత మన శక్తికొద్దీ దాన ధర్మాలు చేయడం వల్ల పాప పరిహారం జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.అందువల్ల మనం చేసే ఎటువంటి సహాయమైనా మనస్ఫూర్తిగా చేయటం ద్వారా అనేక ఫలితాలను పొందవచ్చు.
అయితే ఏ వస్తువు దానం చేయడం వల్ల ఎలాంటి లాభాలు పొందుతారో ఇక్కడ తెలుసుకుందాం.
*ఈ కార్తీక మాసంలో ఇతరులకు బియ్యాన్ని దానంగా ఇవ్వడం ద్వారా ఎన్నో రోజుల నుంచి వెంటాడుతున్న పాపాలు తొలగిపోతాయి.
*వెండిని దానం చేయడం వల్ల ఎంత మనశ్శాంతి లభిస్తుంది.అలాగే బంగారం దానం చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఎంతో ఆనందంగా గడుపుతారు.
*కార్తీక మాసంలో పండ్లు దానం చేయడం వల్ల సిద్ది బుద్ధులు నేర్చుకుంటారు.
*పెరుగు, నెయ్యి దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.
అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
* సంతానం కోసం ఎదురుచూసేవారు తేనె ను దానం చేయడం వల్ల వారికి సంతానం కలుగుతుంది.
అంతేకాకుండా ఉసిరికాయలను ఇతరులకు దానం చేయడం వల్ల మతిమరుపు తగ్గి, జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
*నిద్రలేమి సమస్యతో బాధపడేవారు, కార్తీకమాసంలో ఇతరులకు దీపాలను దానం చేయటం వల్ల ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
అలాగే కొబ్బరి కాయలను దానం చేయడం వల్ల మనం చేసే కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా, అనుకున్న కార్యం సిద్ధిస్తుంది.