ఇటీవల వివిధ వెరైటీ ఆహార పదార్థాలు( Variety Dishes ) సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.వివిధ ఆహార పదార్థాలు ఉపయోగించి వినూత్న పద్దతుల్లో వంటకాలను తయారుచేస్తున్నారు.
కొన్ని వంటకాలు విరక్తి పుడుతుంటే.మరికొన్ని నోరూరించేలా ఉంటున్నాయి.
కొన్ని వంటకాలు చూసి వావ్ అని అనిపిస్తుంటే.మరికొన్నింటిని చూస్తే చీదరించునే పరిస్థితి వచ్చింది.
ఇటీవల కొంతమంది వెరైటీ ఫుడ్ ఐటమ్స్ తయారుచేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.దీంతో అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.

ఇటీవల చాక్లెట్ ఐస్ క్రీం తయారీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే తాజాగా కేక్( Cake ) తయారీ వీడియో ఒకటి చక్కర్లు కొడుతుంది.ఈ వీడియోలో ఒక వ్యక్తి గుడ్లను పగులగొట్టాడు.అనంతరం వాటన్నింటిని ఒక కంటైనర్‌కు బదిలీ చేశాడు.ఆ తర్వాత నీరు, కేకుల తయారీకి ఉపయోగించే పిండి, ద్రావణం అందులో పోశాడు.కొద్దిసేపటి తర్వాత యంత్రం సాయంతో తిప్పి కేకు తయారుచేసే ట్రేలో నింపి బేకింగ్ కోసం గోడ ఓవెన్ లో ఉంచాడు.
కొద్దిసేపటి తర్వాత ఐసింగ్ సహాయంతో డీమోల్డ్ చేసి శాండ్విచ్ చేశాడు.దానిని లవ్ ఆకారంతో కత్తిరించి తర్వాత ఒక క్రీం పూసి సిరప్ తో ( Syrup ) కేక్ ను అలకరించాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.కేక్ ఎలా తయారుచేస్తారనేది చూస్తే చాలా బాగుందని వ్యాఖ్యానిస్తున్నారు.కేక్ తయారీ( Cake Making ) వెనుక ఇంత పెద్ద తతంగం ఉంటుందని దీనిని చూస్తే తెలుస్తుందని అంటున్నారు.ఇక మరికొంతమంది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేక్ ఇంత అపరిశుభ్రంగా ( Unhygienic ) తయరుచేస్తారా అంటూ మండిపడుతున్నారు.కేక్ లు తయారు చేసే బేకరీలకు కొన్ని మార్గదర్శకాలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
కేవలం తెలిసిన కంపెనీల కేక్ లను మాత్రమే కొనుగోలు చేయాలని, చిన్న చిన్న షాపుల్లో దొరికే వాటిని తినవద్దని సూచిస్తున్నారు.







