1.ఎంసెట్ ,ఈసెట్ ఫలితాలు విడుదల
నేడు తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.
2.జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం
ఈ రోజు ఉదయం 10 గంటలకు గోషామహల్ లో బిజెపి ర్యాలీ మొదలుపెట్టింది.
ఆకాష్ కోరి నుంచి దూల్ పేట్ వరకు బిజెపి బైక్ ర్యాలీ నిర్వహిస్తోంది.ఈ సందర్భంగా 2 వేల కు పైగా జాతీయ జెండాలను బిజెపి నేతలు పంపిణీ చేయనున్నారు.
3.టిఆర్ఎస్ బహిరంగ సభ
ఈనెల 20 మునుగోడులో టిఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది.ఈరోజు సభా స్థలాన్ని నల్గొండ జిల్లా టిఆర్ఎస్ నేతలు పరిశీలించనున్నారు.
4.ఐదు కిలోమీటర్లు జాతీయ పతాకం ఆవిష్కరణ
నేడు రాజమండ్రిలో ఐదు కిలోమీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని ఆజాద్ అమృత్ మహోత్సవంలో భాగంగా రాజమండ్రి హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద హోంమంత్రి తానేటి వనిత ఆవిష్కరించనున్నారు.
5.గరుడ వాహనంపై మల్లయ్యప్ప స్వామి
ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మల్లయ్య స్వామి.
6.ఈ రోజు కోర్టుకు ఎమ్మెల్సీ అనంత బాబు
నేడు ఎమ్మెల్సీ అనంతబాబును కోర్టులో పోలీసులు హాజరు పరచనున్నారు.
7.బండి సంజయ్ కామెంట్స్
కెసిఆర్ కు దమ్ము ,ధైర్యం ఉంటే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి టిఆర్ఎస్ లో చేరిన వారందరితోనూ రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.
8.గవర్నర్ రక్షాబంధన్ శుభాకాంక్షలు
తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
9.షర్మిల కామెంట్స్
అప్పులు ఎలా చేద్దామని క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నారని, కమిషన్లు మింగడానికి అప్పులు చేస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు చేశారు.
10.22న స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు
ఈనెల 22న స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ కె.కేశవరావు తెలిపారు.
11.కొమరం భీమ్ మనవడు కి ఢిల్లీ నుంచి పిలుపు
కొమరం భీం మనవడు కుమరం సోనేరావుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది.కేంద్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన 75 వ ఆజాదీక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేసిన ఉద్యమకారుల వంశస్థులను కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ ఆహ్వానించారు.
12.కాలేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారి
కాలేశ్వరం పుష్కర్ ఘాట్ వద్ద 12.580 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది.దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
13.విజయశాంతి విమర్శలు
మహబూబ్ నగర్ జిల్లాలో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే రైతన్నలకు తీవ్రం నష్టం వాటిల్లిందని బిజెపి నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు.
14.ఎయిర్ ఇండియా అదనపు సర్వీసులు
ఎయిర్ ఇండియా 24 సర్వీస్ లను దేశవ్యాప్తంగా పెంచింది.ముంబై నుంచి హైదరాబాద్, చెన్నై, అలాగే ఢిల్లీ నుంచి ముంబై బెంగళూరు, అహ్మదాబాద్ మార్గాల్లో ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.
15.బండి సంజయ్ సిపిఐ నారాయణ కామెంట్స్
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సిపిఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.మునుగోడులో పోటీ చేయాలా వద్దా అనేది మేము తెల్చుకుంటామని, మా గురించి చెప్పడానికి నువ్వు ఎవడివి కోన్ కిస్కావి అంటూ ఫైర్ అయ్యారు.
16.మల్లన్న హుండీ ఆదాయం
శ్రీశైల మహా క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మ వాళ్లకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు.మొత్తం 3.68 కోట్లు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు.
17.సి పెట్ డిప్లమో కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ
ప్లాస్టిక్ టెక్నాలజీలో డిప్లమో, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో కోర్సులకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు సిపెట్ జాయింట్ డైరెక్టర్ హెడ్ సిహెచ్ శేఖర్ తెలిపారు.
18.శశి తరూర్ కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం
కాంగ్రెస్ సీనియర్ నేత తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం ‘ షువలియో డి లా లిజియన్ హానర్ ‘ వరించింది.
19.అంగన్వాడీ పోస్టుల భర్తీ
తెలంగాణ వ్యాప్తంగా త్వరలో 5111 అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు కేసీఆర్ అధ్యక్షుడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,350 24 క్యారెట్ల 10 గ్రామంలో బంగారం ధర -51,650
.