ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పని చేయడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, హార్మోన్ చేంజ్, పలు రకాల మందుల వాడకం, చర్మ సంరక్షణ లేకపోవడం తదితర కారణాల వల్ల ఇటీవల రోజుల్లో చాలా మంది పాతికేళ్లకే ముడతల సమస్యను ఫేస్ చేస్తున్నారు.ముడతలు ముసలితనానికి సంకేతం.
అందుకే చిన్న వయసులో ముడతలు వచ్చాయంటే ఎక్కడలేని ఆందోళన మన చుట్టూనే తిరుగుతుంది.
ఈ క్రమంలోనే ముడతలను నివారించుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.
మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీని పాటిస్తే ఎలాంటి ముడతలైన క్రమంగా మాయమవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ లో శుభ్రంగా కడిగి సన్నగా తరుముకోవాలి.అలాగే ఒక నిమ్మ పండు తీసుకుని నీటిలో కడగాలి.
ఇలా కడిగిన నిమ్మ పండు పై తొక్క మాత్రం వచ్చేలా తురుముకోవాలి.

ఆ తర్వాత ఒక గ్లాస్ జార లో క్యారెట్ తురుము, నిమ్మ తొక్కల తురుము వేసుకోవాలి.అలాగే రెండు లేదా మూడు బిర్యానీ ఆకులు తుంచి వేసుకోవాలి.ఇప్పుడు ఈ గ్లాస్ జార్ ను మరుగుతున్న నీటిలో కనీసం పదిహేను నిమిషాల పాటు ఉంచి హీట్ చేయాలి.
అనంతరం స్టవ్ ఆఫ్ చేసి హీట్ చేసుకున్న మిశ్రమం నుంచి పల్చటి వస్త్రం సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేకప్ ను పూర్తిగా తొలగించి వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న ఆయిల్ ను ముఖానికి మెడకు కావాలనుకుంటే చేతులకు అప్లై చేసుకుని స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి.
ఆపై నిద్రించాలి.ఇలా ప్రతిరోజు చేస్తే కనుక ముడతలు క్రమంగా మాయమవుతాయి.
సాగిన చర్మం టైట్ గా మరియు గ్లోయింగ్ గా మారుతుంది.దీంతో యవ్వనంగా మెరిసిపోతారు.