బీర్ త్రాగితే కిడ్నీలలోని రాళ్లు బయటకు పోతాయా.. అసలు నిజం చెప్పినా నిపుణులు..!

మద్యపానం( Drinking ) ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నా కూడా కొంతమంది మద్యానికి బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.యువకుల దగ్గర నుంచి వృద్ధుల వరకు చాలామంది మద్యాన్ని సేవిస్తున్నారు.

 If You Drink Beer, The Stones In The Kidneys Will Be Removed.. Even If The Exper-TeluguStop.com

మరి కొంతమంది అయితే ఒక్కరోజు కూడా మందు లేనిదే ఉండలేకపోతున్నారు.మరో విషయం ఏమిటంటే ఈ రోజులలో ఎక్కువగా బిర్( Bir ) తాగడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.

చిన్న పార్టీ అయినా నలుగురు స్నేహితులు, కలిసినా బిర్ తాగడం కామన్ గా మారిపోయింది.అయితే బీర్ తాగడం వల్ల కిడ్నీలోని రాళ్లు తొలగిపోతాయని చాలామంది భావిస్తున్నారు.

కానీ దీనిపై నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు.

Telugu Alcohol, Pressure, Tips, Kidneys-Telugu Health Tips

బీర్ తాగడం వల్ల రాళ్లు తొలగిపోతాయనేది కేవలం అపోహ మాత్రమే అని స్పష్టం చేశారు.బీర్ తాగడం వల్ల కిడ్నీలో ఉన్నటువంటి రాళ్లు బయటకు వస్తాయనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పరిశోధకులు చెబుతున్నారు.అలాగే పదేపదే బీర్ తాగడం వల్ల మూత్రపిండాలు( Kidneys ) విఫలమవుతాయని, రక్తపోటు( Blood pressure ) క్యాన్సర్ తో సహా రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడుతుందని చెబుతున్నారు.

బీరు తాగినప్పుడు మూత్ర విసర్జన జరుగుతుందని అలాంటి సమయంలో కిడ్నీలలో ఉండే రాళ్లు బయటకి సులువుగా వెళ్ళిపోతాయని చాలామంది అపోహ పడుతున్నారు.వాస్తవానికి ఆల్కహాల్ ( Alcohol )అయినా బీర్ అయినా కిడ్నీలలో ఉన్న రాళ్ళను బయటకు పంపడంలో సహాయపడదని చెబుతున్నారు.

Telugu Alcohol, Pressure, Tips, Kidneys-Telugu Health Tips

అయితే మూత్ర విసర్జనను పెంచేందుకు బీరు పని చేస్తుందని దీనివల్ల చిన్న చిన్న రాళ్ళను తీయడం సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు.కానీ 5 మిల్లీమీటర్ల కంటే పెద్ద రాళ్లు బయటకు తీయలేమని చెబుతున్నారు.వాటి పెరుగుదల మార్గం సుమారు మూడు మిల్లీమీటర్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.మూత్రపిండాలలో నొప్పి ఉన్నప్పుడు బీరు తాగితే ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని కూడా వైద్యులు చెబుతున్నారు.

బీర్ అధికంగా తీసుకోవడం వల్ల డీ హైడ్రైషన్‌ కు కూడా దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube