డస్ట్ అండ్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి ముఖాన్ని క్షణాల్లో మెరిపించే ఎఫెక్టివ్ చిట్కా మీకోసం!

ఎప్పుడైనా సడ‌న్‌గా ఫంక్షన్ కి లేదా పెళ్లికి లేదా ప్రియమైన వారితో డిన్నర్ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖం డల్ గా, నిర్జీవంగా ఉంటే బయట కాలు పెట్టడానికి కూడా ఇష్టపడరు.ఫుల్ మూడ్ ఆఫ్ అయిపోతారు.

 An Effective Tip To Remove Dust And Dead Skin Cells And Brighten The Face Detail-TeluguStop.com

బ‌య‌ట‌కు వెళ్లాల‌న్న ఉత్సాహం దూరం అవుతుంది.అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ ఇంటి చిట్కాను పాటిస్తే క్షణాల్లో చర్మం పై పేరుకు పోయిన డస్ట్ అండ్ డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

క్షణాల్లో ముఖం తెల్లగా మరియు కాంతివంతంగా మెరుస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఇంటి చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి, హాఫ్ టేబుల్ స్పూన్ యాక్టివేటెడ్ చార్కోల్, రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజల పొడి వేసుకుని స్పూన్‌ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

చివరిగా సరిపడా వాటర్ వేసి మరోసారి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని స్మూత్ గా ర‌బ్‌ చేసుకోవాలి.ఆపై పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని అప్పుడు గోరు వెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే చర్మం పై పేరుకుపోయిన డస్ట్ మరియు డెడ్ స్కిన్ సెల్స్ సులభంగా తొలగిపోతాయి.

డల్ గా ఉన్న ముఖ చర్మం క్షణాల్లో తెల్లగా మరియు గ్లోయింగ్ గా మెరిసి పోతుంది.కాబట్టి స్కిన్ ఎప్పుడైనా డల్ మరియు నిర్జీవంగా ఉన్న సమయంలో తప్పకుండా ఈ ఎఫెక్టివ్‌ ఇంటి చిట్కాని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube