ఓట్స్ తో హోమ్‌ మేడ్ ఫేస్ క్రీమ్.. రోజు వాడితే స్కిన్ వైట్ గా మారడం ఖాయం!

ఓట్స్.వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.ప్రస్తుత రోజుల్లో ఓట్స్ ను విరివిరిగా వాడుతున్నారు.ముఖ్యంగా ఫిట్ నెస్ పై శ్రద్ధ ఉన్నవారు తప్పకుండా తమ డైట్ లో ఓట్స్ ను చేర్చుకుంటారు.అయితే ఓట్స్ ఆరోగ్యానికి మాత్రమే కాదు అందాన్ని పెంచడానికి సైతం ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా ఓట్స్ తో హోమ్ మేడ్ ఫేస్ క్రీమ్ ను కనుక త‌యారు చేసుకుని రోజు వాడితే మీ స్కిన్ వైట్ గా బ్రైట్ గా మారడం ఖాయం.

 How To Make Face Cream With Oats! Face Cream, Oats Face Cream, Latest News, Skin-TeluguStop.com

మరి ఇంకెందుకు ఆలస్యం ఓట్స్ తో ఫేస్ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు బాదం పప్పులు వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ వేసి ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరో గిన్నెలో చిటికెడు కుంకుమ పువ్వు వేసి కొద్దిగా వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు ఉదయాన్నే మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న ఓట్స్ మరియు బాదంపప్పును వేసుకోవాలి.అలాగే కుంకుమపువ్వు వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Tips, Face Cream, Homemadeface, Latest, Oats, Oats Benefits, Oats Face Cr

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ లో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకోవాలి.మరియు తయారు చేసుకున్న జ్యూస్ ను నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్లు చొప్పున‌ వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన క్రీమ్ సిద్ధం అవుతుంది.

Telugu Tips, Face Cream, Homemadeface, Latest, Oats, Oats Benefits, Oats Face Cr

ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నెలరోజుల పాటు వాడుకోవచ్చు.నైట్ నిద్రించే ముందు ముఖానికి ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను అప్లై చేసుకోవాలి.ప్రతిరోజు ఈ క్రీమ్ ను వాడితే మీ ముఖ చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.

నల్లటి వలయాలు ఉంటే దూరం అవుతాయి.ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి.

సాగిన చర్మం టైట్‌గా మారుతుంది.మరియు చర్మం సూపర్ షైనీ గా సైతం మెరుస్తుంది.

కాబట్టి తప్పకుండా ఈ హోమ్ మేడ్ ఫేస్ క్రీమ్ ను తయారు చేసుకొని వాడండి.సహజంగానే అందంగా మెరిసిపోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube