అధిక బ‌రువును త‌గ్గించే పచ్చి బొప్పాయి.. మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా?

అధిక బ‌రువు.నేటి కాలంలో చాలా మంది కామ‌న్‌గా ఎదుర్కొంటున్న స‌మ‌స్య ఇది.

మారిన జీవ‌న‌శైలి, ఆహార‌పు అల‌వాట్లు, వ్యాయామాలు చేయకపోవడం ఇలా అధిక బ‌రువు పెర‌గ‌డానికి ఎన్నో కార‌ణాలు ఉన్నాయి.ఇక ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో అధిక బ‌రువు స‌మ‌స్య మ‌రింత పెరిగిపోయింది.

క‌రోనా కార‌ణంగా జిమ్‌లు మూసేయ‌డంతో ఇంట్లోనే ఉంటున్న ప్ర‌జ‌లు వ్యాయామాల‌పై దృష్టి త‌గ్గించేశారు.ఈ క్ర‌మంలోనే చాలా మంది ఊహించ‌ని విధంగా బ‌రువు పెరిగిపోయి.

ఎలా త‌గ్గాలా అని తెగ స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.అయితే అధిక బరువును త‌గ్గించ‌డంలో ప‌చ్చి బొప్పాయి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

వాస్త‌వానికి చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అంద‌రూ ఇష్ట‌ప‌డే బొప్పాయి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.తియ్య‌గా, య‌మ్మీగా ఉండే బొప్పాయి వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

Advertisement

కానీ, చాలా మంది బొప్పాయి పండునే ఎక్కువ‌గా తింటుంటారు.కానీ, ప‌చ్చి బొప్పాయితో కూడా బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగున్నాయి.

ఆ ప్ర‌యోజ‌నాల్లో మొద‌టిది.అధిక బ‌రువు నియంత్రించ‌డం.

అవును, వేగంగా బ‌రువు త‌గ్గించ‌డంలో ప‌చ్చి బొప్పాయి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ప్ర‌తి రోజు మితంగా కొన్ని ప‌చ్చి బొప్పాయి ముక్క‌లు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయి ఉన్న అద‌న‌పు కొవ్వును క‌రిగిస్తుంది.

త‌ద్వారా అధిక బ‌రువుకు చెక్ పెట్ట‌వ‌చ్చు.అలాగే మ‌ధుమేహం ఉన్న వారు ప‌చ్చి బొప్పాయిని తీసుకోవ‌డం వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటుంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ప‌చ్చి బొప్పాయి ముక్క‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.అదే స‌మ‌యంలో శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ క‌రిగించి.

Advertisement

మంచి కొల‌స్ట్రాల్ పెంచుతుంది.త‌ద్వారా గుండె జ‌బ్బుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

అలాగే అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య ఉన్న వారు ప‌చ్చి బొప్పాయి తీసుకుంటే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి ఉండే ప‌చ్చి బొప్పాయి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌పడుతుంది.

కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

తాజా వార్తలు