నయనతార( Nayanthara ) గురించి మనందరికీ తెలిసిందే.తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది నయనతార.
సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటికీ అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.ప్రస్తుతం ఒకవైపు నిర్మాతగా వ్యవహరిస్తూనే మరొకవైపు హీరోయిన్గా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి( Tollywood film industry ) దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కోలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

అయితే టాలీవుడ్ లో చాలా మంది హీరోల సరసన ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Power Star Pawan Kalyan ) తో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు.కాగా మాములుగా ఏ హీరోయిన్ అయినా సరే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఛాన్స్ వస్తే ఆ అవకాశం అస్సలే వదులుకోవాలి అనుకోదు.కానీ నయనతార మాత్రం తెలిసి తెలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాను రిజక్ట్ చేసింది.
పవన్ కళ్యాణ్ శృతి హాసన్ కాంబోల వచ్చిన గబ్బర్ సింగ్ ( Gabbar Singh )బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో వకీల్ సాబ్ మూవీ వచ్చింది.

ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అయితే ఈ సినిమాలో మొదట నయనతారను సెలక్ట్ చేశారట డైరెక్టర్.కానీ పాత్ర చిన్నగా ఉండటంతో నయన్ ఆ సినిమాను రిజక్ట్ చేసిందట.అలా ఈ సినిమా నయనతార రిజెక్ట్ చేయడంతో శృతిహాసన్ ను అవకాశం వరించింది.ఇకపోతే నయనతార విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె బాలీవుడ్లో అలాగే కోలీవుడ్ లో వరుసగా సినిమాలలో నటిస్తూ మరోవైపు సినిమాలను నిర్మిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు కూడా తల్లి అయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే మరొకవైపు కెరియర్ పరంగా బిజీబిజీగా ఉంది.