సాధారణంగా ఏదైనా పండుగలు, ప్రత్యేక రోజుల్లో మనం దేవాలయాలను దర్శిస్తుంటాము.మన దేశంలో ఎక్కడికి వెళ్లిన శివాలయాలు ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి.
శివాలయాలలో మనకి ఎక్కువగా శివలింగాలు దర్శనమిస్తుంటాయి.దేవాది దేవతలు ప్రతిష్టించిన ఆ లింగానికి పూజ చేస్తారు.
కానీ ఏ సమయంలో ఎటువంటి శివలింగానికి పూజ చేయాలి? ఏ శివలింగాన్ని ఎవరు పూజించాలి? ఏ విధంగా పూజించాలి ?అనే విషయాలు చాలా మందికి తెలియక పోవచ్చు.అయితే ఎవరు ఎటువంటి శివలింగాన్ని పూజించాలి, వాటిని పూజించటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం…
లింగ పురాణం ప్రకారం బ్రాహ్మణ వేత్తలు రసలింగాన్ని పూజించాలి.
అదేవిధంగా క్షత్రియులు బాణాలింగాన్ని పూజించాలి.వ్యాపార ప్రధానమైన వైశ్యులు స్వర్ణ లింగాన్ని పూజించుకోవాలి.అయితే ఎటువంటి బేధాభిప్రాయాలు లేకుండా ఎవరైనా కూడా స్పటిక లింగానికి పూజలు చేసుకోవచ్చు.దీర్ఘ సుమంగళిగా ఉన్నవారు స్పటిక లింగాన్ని పూజించాలి.
అలాగే భర్త లేని వారు రసలింగాన్ని పూజించాలని లింగ పురాణం చెబుతోంది.
లింగ పురాణం ప్రకారం ఏ విధమైన శివలింగాన్ని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది కూడా క్లుప్తంగా వివరించబడి ఉంది.రత్నాజ లింగాన్ని పూజించడం వల్ల ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది.అలాగే ధాతుజలింగం పూజించడం వల్ల భోగ విలాసాలను కలిగిస్తుంది.
శివునికి సంబంధించినటువంటి లింగాలలో బాణలింగం ఎంతో పవిత్రమైనదని లింగపురాణంలో పేర్కొంది.ఈ లింగాలు తెల్లగా చిన్న అండాకారంలో నదీ ప్రవాహాల వల్ల సహజంగా నునుపుదేలి ఉంటాయి.
ఇటువంటి శివలింగాలు ఎక్కువగా నర్మదా నదిలో లభిస్తుంటాయి.ఈ లింగాలకు పూజ చేసుకునేవారు ఎల్లప్పుడు ఉత్తర ముఖంగా కూర్చుని పూజ చేయాలి.
అలాగే పూజకు తప్పనిసరిగా మారేడు దళాలు, రుద్రాక్షలు,భస్మం ఈ మూడు అంటే ఆ శివునికి ఎంతో ప్రీతికరమైనవి కనుక లింగానికి పూజ చేసే సమయంలో ఈ మూడు వస్తువులు తప్పనిసరిగా ఉండాలని శివపురాణం చెబుతోంది.