శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల సిరి సంపదలు పెరుగుతాయని చాలామంది పెద్దవారు నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే ఈ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం ఎంతో మంచిది.
అంతే కాకుండా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి, లక్ష్మీ స్తోత్రాన్ని పఠించిన ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతూ ఉంటారు.ఈ రోజున ఏ శుభకార్యాన్ని చేసినా కూడా మంచి జరుగుతుంది.
శుక్రవారం రోజు లక్ష్మి అమ్మవారిని నిష్టతో పూజించిన వారి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు దూరమైపోతాయి.
శుక్రవారం రోజున మంచి పనులు చేయడంతో పాటు పొరపాటున కూడా ఎవరూ చేయకూడని పనులు కూడా ఉన్నాయి.
అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు.మరి శుక్రవారం రోజున ఏ పనులను చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శుక్రవారం రోజు లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంటికి వచ్చే రోజు అమ్మవారిని ఈ రోజున అస్సలు బయటికి తీయకూడదు.ఇంట్లో ఏదైనా పాత లేదా విరిగిన అమ్మవారి విగ్రహాన్ని శుక్రవారం రోజు అసలు నిమర్జనం చేయకూడదు.
అలా చేయడం అశుభం.

ఇంకా చెప్పాలంటే సాయంత్రం సమయంలో కొద్దిసేపు ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలని శాస్త్రాలలో ఉంది.సాయంత్రం పూట లక్ష్మీదేవి తన భక్తుల ఇళ్లకు వెళుతుందని చెబుతూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే శుక్రవారం రోజు ఇంటి లక్ష్మి అయినా ఆడవారిని సృష్టికి మూలమైన ఆదిపరాశక్తి స్వరూపం వారిని గౌరవించి పూజించిన చోట స్వయంగా దేవతలు తిరుగుతారని మన శాస్త్రాలు చెబుతున్నాయి.
అందువల్ల వారిని బాధించడం అగౌరవ పరచడం, వేధించడం అస్సలు చేయకూడదు.ముఖ్యంగా శుక్రవారం రోజు కొంతమంది మహిళలు లక్ష్మీదేవి కోసం ఉపవాసం పటిస్తూ ఉంటారు.ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున పొరపాటు కూడా వారిని మహిళలను అవమానించకూడదు.శుక్రవారం రోజు ఇలాంటి పనులను అస్సలు చేయకండి.