నిర్మల్ జిల్లాలో లంపి స్కిన్ వైరస్ కలకలం సృష్టిస్తోంది.భైంసా డివిజన్ లో పశువుల్లో లంపి స్కిన్ వైరస్ ను గుర్తించారు.
టాక్లి గ్రామంలో రెండు పశువులు వైరస్ బారిన పడ్డాయి.మరో 50 కి పైగా పశువులకు లంపి స్కిన్ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి.
దీంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు మహారాష్ట్ర సరిహద్దులో చెక్ పోస్టులను ఏర్పాటు చేసారు.
పశువుల రవాణాను నిలిపివేయడంతో పాటు, గ్రామాల్లో పశువుల వారపు సంతలు కూడా జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.అదేవిధంగా వైరస్ పై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
పశువుల పాకల్లో సాయంత్రం సమయాల్లో దోమలు, కీటకాలు రాకుండా చూడాలని రైతులకు సూచిస్తున్నారు.ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో రెండు జిల్లాల్లో లంపి స్కిన్ వైరస్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.