ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలలో ఆరోగ్యం పై కాస్త శ్రద్ధ పెరిగింది అని చెప్పాలి.ఎందుకంటే కరోనా వ్యాధి ప్రపంచ ప్రజల జనజీవనాన్ని అతలాకుతలం చేసింది.
అందువల్ల ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు.అలాగే తాంబూలం తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
తాంబూలం తీసుకుంటే ఆహారం సులభంగా, తేలికగా జీర్ణం అయ్యే అవకాశం ఉంది.దాని వల్ల ఆకలి కూడా చాలా వరకు అదుపులో ఉంటుంది.
రాత్రి పూట నాన బెట్టిన తమలపాకు, నాన బెట్టిన నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

తమలపాకు కొద్దిగా ఉప్పు, జీలకర్ర కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి.అలాగే తమలపాకు రసం తో పాటు తింటే ఎముకలు దృఢంగా తయారవుతాయి.గొంతు నొప్పి సమస్యలకు తమలపాకు రసంలో కొద్దిగా సున్నం కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
తమలపాకులు ఆల్కలీన్ సుభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటాయి.తాంబూలం లో నలుపు, తెలుపు రంగులతో కూడినవి ఉంటాయి.
అయితే తమలపాకును ఉపయోగించినప్పుడల్లా దాన్ని నుండి కాండం, నరాల భాగాన్ని తొలగించి ఉపయోగించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

అంతేకాకుండా ఇందులో ఐరన్, ఫైబర్, కాల్షియం,థయామిన్, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఏ లాంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.కాబట్టి తాంబూలాన్ని ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.కానీ కొంత మందికి తాంబూలం తింటే కొన్ని రకాల అలర్జీ లాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.
అలాంటి వారు దీనికి దూరంగా ఉండడమే మంచిది.
