సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా మంచి హిట్ అందుకుంటే పెద్ద ఎత్తున డైరెక్టర్ ఇతర చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తారు.అయితే సినిమా ఫ్లాప్ అయితే అదే ప్రేక్షకులు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తారు.
ఒక సినిమా హిట్ అయితే చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించిన ప్రేక్షకులు ఫ్లాప్ అయితే కేవలం డైరెక్టర్ ను మాత్రమే విమర్శిస్తారు.ఇలా ఎంతో మంది డైరెక్టర్లు ఇలాంటి విమర్శలను ఎదుర్కొంటున్నారు.
అయితే కొందరు ఈ విమర్శలపై మౌనం వహిస్తూ ఉండగా మరికొందరు మాత్రం ఇలాంటి విమర్శలపై స్పందిస్తూ దీటుగా సమాధానం చెబుతున్నారు.

ఈ క్రమంలోనే ఇలా తన సినిమా ఫ్లాప్ కావడంతో తనపై వస్తున్నటువంటి విమర్శలపై స్పందించారు ప్రేమమ్ డైరెక్టర్ ఆల్ఫనోస్ పుత్రన్. ఈయన దర్శకత్వంలో వచ్చిన ప్రేమమ్ మలయాళ ఇండస్ట్రీలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈయన గోల్డ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇందులో నయనతార, పృధ్వి రాజన్ సుకుమార్ హీరో హీరోయిన్లుగా నటించారు.ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

ఇలా ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో ప్రేక్షకులు అభిమానులు డైరెక్టర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ఈ క్రమంలోనే ఈ విమర్శలను డైరెక్టర్ ఆల్ఫనోస్ పుత్రన్ ఖండించారు.ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… నా సినిమాలను నన్ను విమర్శించే హక్కు మీకు లేదు.నన్ను నా సినిమాలను విమర్శించే హక్కు కేవలం కమల్ హాసన్ గారికి మాత్రమే ఉంది నేను మీ బానిసను కాదు.
మీకు నచ్చితే నా సినిమాలు చూడండి లేకపోతే లేదు అంటూ తీవ్రంగా తనపై వస్తున్నటువంటి విమర్శలపై ఘాటుగా స్పందించారు.ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లో మరి నీ సినిమాలను ఒక కమల్ హాసన్ గారికి మాత్రమే చూపించుకో అంటూ వ్యంగంగా కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికి డైరెక్టర్ ఆల్ఫనోస్ పుత్రన్ చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







