టాలీవుడ్ లో తమదంటూ ఒక పాత్ర వస్తే, సరైన టైం లో సరైన కథ తో సరైన పాత్ర వస్తే అద్భుతాలు సృష్టించగల నటులలో ఖచ్చితంగా ముందు వరసలో ఉండే నటుడు బెనర్జీ.ఇటీవల కాలం లో అయన విరాట పర్వం సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు.
సినిమా ఎంత పెద్దదైన, పాత్ర మాత్రం ఖచ్చితంగా బెనర్జీ కి ఉంటుంది.కానీ ఆయనకు రావాల్సిన పేరు మాత్రం రాలేదనే చెప్పాలి.
ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ లు ఉన్న మన తెలుగు చిత్ర సీమలో అయన నిజంగానే ఒక గొప్ప నటుడు.అయితే ఈ నటన అంత అయన తండ్రి నుంచి వచ్చిందే.
నటుడు రాఘవయ్య కుమారుడే ఈ బెనర్జీ.

తన తండ్రి ఇచ్చిన నటన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అయన ఎదిగిన వైనం మనం అందరం చూసాం.చాల మంది నటన అంటే బాగా ఎక్స్ప్రెషన్స్ తో గట్టి గట్టిగ అరిచి అందరి అటెన్షన్ సంపాదించడం అని అనుకుంటారు.కానీ బెనర్జీ పూర్తిగా వేరు.
అయన డైలాగ్ చెప్పే విధానం లో ఒక ఫోర్స్ ఉంటుంది కానీ అరవరు.ఎక్కడ కూడా పక్క నటుడిని డామినేట్ చేయడం కూడా కనిపించదు.
ఒక్క మాటలో చెప్పాలంటే సటిల్ యాక్టింగ్ (Subtle Acting) అంటే ఇదే.ఎలాంటి పాత్ర ఇచ్చిన కూడా ఎంతో సమర్థవంతంగా పోషించగలడు.ఓ వైపు క్రూరమైన విలన్ గాను మరోవైపు హీరో హీరోయిన్స్ కి తండ్రి గాను నటించగలడు.

ఇక బెనర్జీ కెరీర్ లో విరాట పర్వం ఒక మంచి సినిమా అని చెప్పచ్చు.1982 లో హరిశ్చంద్రుడు అనే సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి 150 సినిమాల వరకు నటించాడు.ఇక విజయవాడ లో పుట్టిన బెనర్జీ మాంటెస్సారి లో చదువుకున్నాడు.
అతడి తండ్రి రాఘవయ్య ఇన్ఫర్మేషన్ మరియు బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖా లో పని చేయడం వల్ల ఢిల్లీ కి వెళ్లాల్సి వచ్చింది.ఆ తర్వాత చెన్నై కి వచ్చి హోటల్ మేనేజ్మెంట్ చేసాడు.
మొదట్లో విజయనగరం లో ఒక కంపెనీ కి బ్రాంచ్ మేనేజర్ గా పని చేసాడు.ఇక బెనర్జీ కి భార్య మరియు కూతురు ఉన్నారు.